జ‌గ‌న్ ఏమైనా ప్ర‌ధాని అనుకున్న‌వా ప‌వ‌న్‌!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు. అందుకే జ‌గ‌న్ ఏదేదో చేయ‌డానికి ఆలోచించి వుంటార‌ని ప‌వ‌న్ త‌న‌కు తానుగా ఊహించుకుంటున్నారు. త‌న అనాలోచితాన్ని, అజ్ఞానాన్ని దాచుకోడానికి ప‌వ‌న్…

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు. అందుకే జ‌గ‌న్ ఏదేదో చేయ‌డానికి ఆలోచించి వుంటార‌ని ప‌వ‌న్ త‌న‌కు తానుగా ఊహించుకుంటున్నారు. త‌న అనాలోచితాన్ని, అజ్ఞానాన్ని దాచుకోడానికి ప‌వ‌న్ ఏ మాత్రం వెనుకాడక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకోవాలంటూ ఎన్‌డీఏలో భాగ‌స్వామి అయిన ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌ద్ద‌కు కొంత మంది కార్మిక నాయ‌కులు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా కార్మిక సంఘాల నాయ‌కుల్ని విచిత్ర‌మైన ప్ర‌శ్న వేశారు ప‌వ‌న్‌. అదేంటంటే…

“గ‌త ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఉక్కు ప‌రిశ్ర‌మ భూముల్ని అమ్మేద్దామ‌ని మీ ముందు ప్ర‌తిపాదించిన మాట నిజ‌మేనా?” అని ప‌వ‌న్ ప్ర‌శ్నించార‌ట‌. నిజ‌మే అని వాళ్లంతా ముక్త‌కంఠంతో చెప్పిన‌ట్టు టీడీపీ అనుకూల ప‌త్రిక‌ ప‌త్రిక రాయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ అనేది కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలో ఉన్న సంగ‌తి ప‌వ‌న్‌కు తెలియ‌దా? కేంద్ర ప్ర‌భుత్వం ఉక్కు ప‌రిశ్ర‌మ భూముల్ని అమ్ముతూ, దాన్ని ప్రైవేటీక‌రిస్తుంటే, రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఏంటి సంబంధం?

ఉక్కు ప‌రిశ్ర‌మ భూముల్ని అమ్మాల‌ని వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఏ విధంగా ప్ర‌తిపాదిస్తారు? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. కార్మికుల్ని నిజంగానే ప‌వ‌న్ ఇలాంటి ప్ర‌శ్న అడిగి వుంటే, ఆయ‌నంత అజ్ఞాని మ‌రొక‌రు వుండ‌ర‌నే మాట వినిపిస్తోంది. విశాఖ ఉక్కుతో కేంద్రానికి సంబంధం లేక‌పోతే, మ‌రి గ‌తంలో కేంద్ర మంత్రి అమిత్‌షాతో మాట్లాడాన‌ని ప‌వ‌న్ ఎందుకు చెప్పిన‌ట్టు? గ‌తంలో అఖిల‌ప‌క్షంతో కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద‌కు వెళ్లి వుంటే, ఇవాళ ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌ని కార్మిక సంఘాల నేత‌ల‌తో ప‌వ‌న్ ఎలా అన‌గ‌లిగారో ఎవ‌రికీ అర్థం కాదు.

ప్ర‌తిదీ జ‌గ‌న్‌కు ముడిపెట్టి, నెగెటివ్ చేయ‌డానికి ఉన్న‌వీ, లేనివీ మాట్లాడ్డం, రాయ‌డం కూట‌మి ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు, అనుకూల మీడియాకే చెల్లింద‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

20 Replies to “జ‌గ‌న్ ఏమైనా ప్ర‌ధాని అనుకున్న‌వా ప‌వ‌న్‌!”

    1. Ap ప్రభుత్వ భూముల్ని అమ్మే హక్కు రాష్ట్ర ప్రభుత్వానుకి ఉంటుంది కేంద్రంలోని భూముల్ని అమ్మేహక్కు సియంకి ఎలా ఉంటుంది తిక్కోడ

  1. మరి ఇంత తెలిసినవాడివి …జగన్ ని స్టీల్ ప్లాంట్ మూయవద్దని కేంద్రాన్ని అడగమని..రాష్ట్రం లో పిసుకుంట ఏమి వస్తది

  2. నువ్వు న్యూస్ రాశవా?? లేక నీ వ్యూ రాసావా? ఏదో కొంచెం క్లారిటీ మిస్ అయ్యింది

  3. అరేయ్ గ్రేట్ ఆంధ్ర… వెబ్సైటు మీ చెత్త రాతలు ఏందీ రా? Pavanklayan మీద చెత్త రాతలు.. ఈ రోత రాతలు మానవ రా? ఏ చెప్పు తో కొట్టాలి రా?

Comments are closed.