అనుమానం తీరింది.. అందుకే నటించా

సాయిపల్లవి ఓ సినిమా చేస్తోందంటే దానర్థం, అందులో ఆమె పాత్ర చాలా బలంగా ఉందని. పాత్రకు ప్రాధాన్యం లేని సినిమాలు ఆమె అంగీకరించదు. అందుకే ఆమె స్టార్ హీరోల మాస్ మసాలా కమర్షియల్ సినిమాల్లో…

సాయిపల్లవి ఓ సినిమా చేస్తోందంటే దానర్థం, అందులో ఆమె పాత్ర చాలా బలంగా ఉందని. పాత్రకు ప్రాధాన్యం లేని సినిమాలు ఆమె అంగీకరించదు. అందుకే ఆమె స్టార్ హీరోల మాస్ మసాలా కమర్షియల్ సినిమాల్లో పెద్దగా కనిపించదు.

ఇలాంటి హీరోయిన్ శివకార్తికేయన్ సరసన అమరన్ అనే సినిమా చేసింది. అంటే, ఇందులో సాయిపల్లవికి మంచి రోల్ దక్కిందన్నమాట. ఇదే విషయంపై ఈ హీరోయిన్ స్పందించింది. అనుమానాలన్ని క్లియర్ అయిన తర్వాత ఈ సినిమా చేశానని చెప్పుకొచ్చింది.

“నాకు ముందు స్క్రిప్ట్ వచ్చింది. అది చదివిన తర్వాత చాలా డౌట్స్ వచ్చాయి. కమర్షియల్‌ సినిమాల్లో పెద్ద హీరోలతో కలిసి పని చేస్తున్నప్పుడు చాలా కంటెంట్‌ ఉంటుంది, కాబట్టి స్క్రిప్ట్ లో కాస్త తీసి మిగతావి కట్‌ చేస్తారని అనుకున్నాను. ఇదే విషయం దర్శకుడికి చెప్పాను. ఆయనిచ్చిన నెరేషన్ విన్న తర్వాత ఈ పాత్రను వదులుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి పాత్రలు రావు.”

వీరమరణం పొందిన అశోకచక్ర గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది అమరన్ సినిమా. ఇందులో సాయిపల్లవి మేజర్ భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రను పోషించింది.

ఈ పాత్రను పోషించే ముందు ఇందుతో మాట్లాడానని, ఆమె మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేశానని వెల్లడించిన సాయిపల్లవి.. తన కెరీర్ లో ది బెస్ట్ రోల్స్ లో ఒకటిగా ఇది నిలిచిపోతుందని అంటోంది.

కమల్ హాసన్ నిర్మించిన ఈ సినిమా దీపావళికి థియేటర్లలోకి వస్తోంది. ఆ తర్వాత కొన్ని వారాలకు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వస్తుంది.

5 Replies to “అనుమానం తీరింది.. అందుకే నటించా”

  1. ఈ శివ కార్తికేయన్ చుట్టూ పది మంది buffoons ని వేసుకొని comedy చేసుకోవడం తప్ప ఇలాంటి serious పాత్రలకు పనికిరాడు.

  2. కమల్ నిర్మాత అంటే అర్ధం చేసుకోవచ్చు లే.. ప్రకాష్ కూడా ఉన్నాడా ??

Comments are closed.