అనుకున్నది సాధించిన దిల్ రాజు

సరిగ్గా విశ్వంభర టీజర్ విడుదలకు కొన్ని గంటల ముందు దిల్ రాజు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. విశ్వంభర సంక్రాంతికి రాదని, ఆ స్థానంలో గేమ్ ఛేంజర్ వస్తుందనేది…

సరిగ్గా విశ్వంభర టీజర్ విడుదలకు కొన్ని గంటల ముందు దిల్ రాజు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. విశ్వంభర సంక్రాంతికి రాదని, ఆ స్థానంలో గేమ్ ఛేంజర్ వస్తుందనేది దిల్ రాజు వీడియో సారాంశం.

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ సినిమాను తెరకెక్కిస్తున్న దిల్ రాజు, ఆ మూవీని క్రిస్మస్ కు విడుదల చేయాలనుకున్నాడు. అయితే క్రిస్మస్ కంటే సంక్రాంతికొస్తే బాగుంటుందని డిస్ట్రిబ్యూటర్లంతా ఫీల్ అయ్యారట. అదే ఫీలింగ్ ను చిరంజీవి ముందుంచారట దిల్ రాజు.

దిల్ రాజు అడిగిన వెంటనే చిరంజీవి, విశ్వంభర నిర్మాతలు ఒప్పుకున్నారని… సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నారని దిల్ రాజు ప్రకటించారు. విశ్వంభర సినిమా ఫస్ట్ కాపీ డిసెంబర్ కే రెడీ అవుతుందని, కానీ తమ కోసం సినిమాను వాయిదా వేశారని అన్నారు.

గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే 2 సాంగ్స్ వచ్చాయి. మరో 3 సాంగ్స్ రాబోతున్నాయి. మధ్యలో టీజర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇలా నవంబర్, డిసెంబర్ నెలల్లో పూర్తిస్థాయిలో ప్రచారం చేసి, సంక్రాంతికి సినిమాను విడుదల చేయబోతున్నారు.

మొత్తానికి దిల్ రాజు తను అనుకున్నది సాధించారు. విశ్వంభర వాయిదా పడుతుందని, ఆ స్థానంలోకి గేమ్ ఛేంజర్ వస్తుందని కొన్ని రోజులుగా లీకులిస్తూ, ఫైనల్ గా తను చెప్పాల్సింది చెప్పేశారు.

3 Replies to “అనుకున్నది సాధించిన దిల్ రాజు”

Comments are closed.