వైసీపీ స‌మ‌ర్థ‌త నిరూపించుకునే స‌మ‌యం!

వైసీపీకి ప్ర‌తి రోజూ కీల‌కమే. కూట‌మి పాల‌న‌పై జ‌నంలో అసంతృప్తి మొద‌లైంది. కూట‌మి హామీలేవీ అమ‌లుకు నోచుకోలేద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ఉచిత ఇసుక‌కు చంద్ర‌బాబు స‌ర్కార్ దాదాపు ముగింపు ప‌లికే మార్గంలో…

వైసీపీకి ప్ర‌తి రోజూ కీల‌కమే. కూట‌మి పాల‌న‌పై జ‌నంలో అసంతృప్తి మొద‌లైంది. కూట‌మి హామీలేవీ అమ‌లుకు నోచుకోలేద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ఉచిత ఇసుక‌కు చంద్ర‌బాబు స‌ర్కార్ దాదాపు ముగింపు ప‌లికే మార్గంలో ప‌యనిస్తోంది. ప్రైవేట్ వ్య‌క్తుల‌కు ఇసుక రీచ్‌ల‌ను అప్ప‌గించాల‌ని కూట‌మి స‌ర్కార్ నిర్ణ‌యించింది.

108 ఇసుక రీచ్‌ల‌కు టెండ‌ర్లు నిర్వ‌హించ‌డం, ప్రైవేట్ వ్య‌క్తుల‌కు అప్ప‌గించ‌డం కూడా అయిపోయిన‌ట్టు వార్త‌లొచ్చాయి. అయితే టెండ‌ర్ల‌కు సంబంధించి గుట్టుగా ప‌ని కానివ్వ‌డం, కేవ‌లం రెండు రోజులే స‌మ‌యం ఇవ్వ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

ప్ర‌భుత్వం పార‌ద‌ర్శ‌క‌త‌ను తుంగ‌లో తొక్కిన నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష పార్టీగా వైసీపీ క్రియాశీల‌క పాత్ర పోషించాల్సిన అవ‌స‌రం వుంది. ప్ర‌భుత్వం ఇసుక రీచ్‌ల‌ను త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన వారికి అప్ప‌గించ‌డంపై వైసీపీ న్యాయ పోరాటం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఆ ప‌ని చేసిన‌ప్పుడే వైసీపీకి ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. కూట‌మి ప్ర‌జావ్య‌తిరేక పాల‌న సాగిస్తుంటే, అంద‌రిలా వైసీపీ కూడా చూస్తూ వుంటే ఎప్ప‌టికీ సానుకూల‌త రాదు.

కావున రాత్రికి రాత్రే 108 ఇసుక రీచ్‌ల‌కు టెండ‌ర్లు వేయ‌డం, సొంత‌వారికి అప్ప‌గించార‌నే ఆరోప‌ణ‌ల‌పై నిగ్గు తేల్చేందుకు వైసీపీ న్యాయ పోరాటానికి దిగి, త‌న స‌మ‌ర్థ‌త‌ను చాటుకోవాల్సి వుంది. గ‌తంలో త‌న ప్ర‌భుత్వంపై టీడీపీ న్యాయ పోరాటం చేయ‌డాన్ని స్ఫూర్తిగా తీసుకునైనా, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఇసుక రీచ్‌ల‌పై త‌న లీగ‌ల్ టీమ్‌తో కేసులు వేయిస్తారో, లేదో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.

17 Replies to “వైసీపీ స‌మ‌ర్థ‌త నిరూపించుకునే స‌మ‌యం!”

  1. ప్రభుత్వం లో ఉన్నప్పుడు జి ఓ అన్నీ రహస్యం చేసి, ఇప్పుడు ఏ మొహం పెట్టుకు అడుగుతారు పారదర్శకత?

  2. ఇసుక ఎవరికి ఇచ్చారు ఎలాగ ఇచ్చారు అన్నది జనం కి అనవసరం… వాళ్ళకి తక్కువ ధర కి నాణ్యమైన ఇసుక..

    ఇప్పుడు అయితే ప్రభుత్వ వైపల్యం కొంచం కనబడుతోంది… ఇప్పుడే అంచనా కి రావడం కరెక్ట్ కాదు… కొంచం వేచి చూడాలి

Comments are closed.