రెక్కల గుర్రంపై చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం విశ్వంభర. ఈ సినిమా నుంచి దసరా కానుకగా టీజర్ రిలీజ్ చేశారు. దశాబ్దాల గ్యాప్ తర్వాత సోషియా ఫాంటసీ జానర్ లో సినిమా చేస్తున్న చిరంజీవి, విశ్వంభర టీజర్…

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం విశ్వంభర. ఈ సినిమా నుంచి దసరా కానుకగా టీజర్ రిలీజ్ చేశారు. దశాబ్దాల గ్యాప్ తర్వాత సోషియా ఫాంటసీ జానర్ లో సినిమా చేస్తున్న చిరంజీవి, విశ్వంభర టీజర్ లో రెక్కల గుర్రంపై ప్రత్యక్షమయ్యారు.

సినిమా జానర్ ఏంటి.. విశ్వంభర ప్రపంచం ఏంటి అనే విషయాల్ని టీజర్ తో చెప్పే ప్రయత్నం చేశారు. సృష్టికి ఓ ఆపద వస్తుంది, దాన్నుంచి ప్రపంచాన్ని కాపాడే యోధుడి పాత్రలో చిరంజీవిని ప్రజెంట్ చేశారు.

చిరంజీవి ప్రజెన్స్ కంటే టీజర్ లో గ్రాఫిక్స్ ఎక్కువగా డామినేట్ చేశాయి. గ్రాఫిక్ వర్క్ చాలా బాగుంది. మూవీలా ఫాంటసీ టైపులో యాక్షన్ ఉంటుందనే విషయాన్ని కూడా టీజర్ లో చెప్పకనే చెప్పారు. కీరవాణి అందించిన బీజీఎం బాగుంది.

‘ప్రశ్నను పుట్టించిన కాలమే, సమాధానాన్ని కూడా సృష్టిస్తుంది.’ ‘విర్రవీగుతున్న ఈ అరాచకానికి ముగింపు పలికే మహాయుద్ధం వస్తోంది’ లాంటి డైలాగ్స్ టీజర్ లో మెరిశాయి. అయితే చిరంజీవిది ఓ చిన్న డైలాగైనా పెడితే బాగుండేది.

ఇక సినిమా విడుదల విషయానికొస్తే.. టీజర్ లో విడుదల తేదీని ప్రకటించలేదు. విశ్వంభర సినిమా సంక్రాంతికి రాదనే విషయాన్ని టీజర్ విడుదలకు కాస్త ముందు దిల్ రాజు వీడియో ద్వారా చెప్పించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వేసవికి విశ్వంభర వచ్చే అవకాశం ఉంది.

11 Replies to “రెక్కల గుర్రంపై చిరంజీవి”

  1. ప్రతిదానికీ ఏడిస్తే ఎలా GA గారూ… టీజర్ లుక్స్ గుడ్. Let us wait and see how the movie will be.

      1. నోటితో పొగుడుతూ… నొసటితో వెక్కిరించడం అని ఒక విధానం ఉంటుంది. ఆర్టికల్ మరోసారి చదవండి

Comments are closed.