జ‌నంలోకి జ‌గ‌న్‌.. ఎప్ప‌టి నుంచి అంటే?

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి జ‌నంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ నాలుగు నెల‌ల పాల‌న పూర్తి చేసుకుంది. ఘోర ప‌రాజ‌యం పాలైన వైసీపీ.. కూట‌మి స‌ర్కార్‌కు క‌నీసం ఏడాది స‌మ‌యం ఇవ్వాల‌ని…

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి జ‌నంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ నాలుగు నెల‌ల పాల‌న పూర్తి చేసుకుంది. ఘోర ప‌రాజ‌యం పాలైన వైసీపీ.. కూట‌మి స‌ర్కార్‌కు క‌నీసం ఏడాది స‌మ‌యం ఇవ్వాల‌ని ఓడిపోయిన కొత్త‌లోనే నిర్ణ‌యించింది. ఈ విష‌యాన్ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ త‌న పార్టీ నాయ‌కుల స‌మావేశంలో స్ప‌ష్టం చేశారు.

బాబు స‌ర్కార్‌కు రోజురోజుకూ ఆయుష్షు త‌గ్గుతోంది. జ‌మిలి ఎన్నిక‌లొస్తాయ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు చంద్ర‌బాబు స‌ర్కార్ పాల‌న‌పై మిశ్ర‌మ అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. కూట‌మి కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు సైతం పాల‌న‌పై ఎక్కువ‌గా నిట్టూర్పులు విడుస్తున్నారు. పాల‌నా వైఫ‌ల్యాలు చాలా త‌క్కువ కాలంలోనే ఎక్కువ క‌నిపిస్తున్నాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

అయితే బాబు స‌ర్కార్‌పై వ్య‌తిరేక‌త‌ను సొమ్ము చేసుకోడానికి వైఎస్ జ‌గ‌న్ ఎలాంటి వ్యూహాన్ని ర‌చిస్తార‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ముఖ్యంగా త‌న కార్య‌క‌ర్త‌ల‌ను, ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వాన్ని కాపాడుకోవ‌డంపై జ‌గ‌న్ దృష్టి పెట్ట‌నున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీర‌గానే వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌పై పెద్ద ఎత్తున దాడులు జ‌రిగాయి. ఆస్తుల విధ్వంసం యథేచ్ఛ‌గా సాగింది. కొన్ని చోట్ల వైసీపీ నాయ‌కుల వ్యాపారాల్ని కూడా టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు లాక్కున్నారు.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది మార్చి నుంచి కూట‌మి పాల‌న‌లో న‌ష్ట‌పోయిన వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, అలాగే సామాన్య ప్ర‌జ‌ల్ని క‌ల‌వాల‌ని వైఎస్ జ‌గ‌న్‌ నిర్ణ‌యించుకున్నార‌ని తెలిసింది. అంత వ‌ర‌కూ త‌న వ‌ద్ద‌కు వ‌చ్చే వారిని క‌ల‌వ‌డానికి జ‌గ‌న్ ప్రాధాన్యం ఇస్తార‌ని స‌మాచారం. మార్చిలో జ‌గ‌న్ ప‌రామ‌ర్శ సంద‌ర్భంగా బాధితుల‌కు ఆర్థికంగా, హార్థికంగా అండ‌గా నిలిచే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలిసింది.

జ‌గ‌న్ జ‌నంలోకి వెళితే వైసీపీకి రాజ‌కీయంగా క‌లిసొచ్చే అవ‌కాశం వుంది. ఆ రోజుకు కూట‌మి స‌ర్కార్‌పై మ‌రింత వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని వైసీపీ నాయ‌కులు న‌మ్ముతున్నారు. జ‌గ‌న్ జ‌నంలోకి వెళ్లే విష‌య‌మై ఇప్ప‌టికే పార్టీ ముఖ్యుల‌తో చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. జ‌నంలోకి జ‌గ‌న్ వెళితే, కూట‌మి స‌ర్కార్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం ఖాయం.

17 Replies to “జ‌నంలోకి జ‌గ‌న్‌.. ఎప్ప‌టి నుంచి అంటే?”

  1. అధికారం కోసం.. జగన్ జనం లోకి..

    అధికారం రాగానే.. జనం గంగ లోకి..

  2. ఎవరక్కడ..అన్న బయటకు వస్తారు??? అంట.. ఎక్కడికక్కడ పరదాలు పరచండి… రెడ్ కార్పెట్ లు వెయ్యండి… బారికాడ్ లు పెట్టండి… దారి పొడుగునా చెట్ల కొట్టించండి… ఆడ కూతుళ్ళ వంటి మీద నల్ల చున్నీ లు తీయించండి…

    1. పార్టీ ఎక్కడకి పొతది రా అయ్యా…ఓడిపోయిన తరవాత ప్రతీ పార్టీ కి జరిగేదే ఇప్పుడీ YCP కి జరుగుతూంది.

      కొన్ని విషయాల్లో జగన్ మారితే అంతా సర్దుకుంటుంది .జగన్ మారెటట్లు TDP, JSP వాళ్ళు చేస్తారు. Dont worry.

      Demacracy లో గెలుపు ఓటములు సహజం.

  3. ఆర్థికంగా.. హార్దికం గానా???? అసలు ముందు వరద బాధితులకు చేస్తాం అని ప్రకటించిన కోటి ఎక్కడ.. పోనీ ఏమన్నా సహాయ కార్యక్రమాలు అయినా చేసారా????

  4. 175/175 ఫర్ 25/25yrs అన్నవాడు, 60/100 ప్రజలు అసెంబ్లీ లో చిరునామా లేకుండా అవమానించారు. మరల జనాల్లోకి సిగ్గు లేకుండా ఎలా వొస్తాడో, సిగ్గుమలినోడు?

  5. 😂😂😂…. March వరకు ఆ నష్ట పోయిన వాళ్ళు ఏం చెయ్యాలి GA…. అలాగే ప్రతి ఊర్లో మీరు ఈ 5yrs లో చేసిన అరాచకాల వల్ల నష్టపోయిన వాళ్ళు వందల్లో వుంటారు….వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా …మరి వాళ్లకేం సహాయం చేస్తారు GA… ఆలోచించు…..

  6. బర్రె మాంసం ముక్క లు ప్యాలస్ గడప దగ్గర పెట్టండి

    ఆ టేస్ట్ కోసం ప్యాలస్ లో నుండి బయటకి పరిగెత్తుకు వస్తాడు.

  7. ఎప్పుడో ఒకప్పుడు గానీ… నత్తోనికి మాట్లాడం, చూసి సక్రమంగా సదవడం నేర్పించి తోలండ్రా అయ్యా…

  8. అప్పటికి రోజుకో శవం ఉండేలా ప్లాన్చే చేస్తున్నారా… పొట్టోడు శవం లేకుండా బయటకు రాలేడు కదా

Comments are closed.