ఇది ఆ సినిమాయేనా అర్జున్..?

కొన్ని రోజుల కిందటి సంగతి.. విశ్వక్ సేన్ హీరోగా ఓ సినిమా ప్రకటించాడు అర్జున్. అందులో తన కూతుర్ని హీరోయిన్ గా పెట్టి స్వీయ దర్శకత్వంలో సినిమా నిర్మించాలనుకున్నాడు. ఓపెనింగ్ కూడా చాలా గ్రాండ్…

కొన్ని రోజుల కిందటి సంగతి.. విశ్వక్ సేన్ హీరోగా ఓ సినిమా ప్రకటించాడు అర్జున్. అందులో తన కూతుర్ని హీరోయిన్ గా పెట్టి స్వీయ దర్శకత్వంలో సినిమా నిర్మించాలనుకున్నాడు. ఓపెనింగ్ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. ఆల్ సెట్ అనుకునేలోపు సినిమా ఆగిపోయింది. విశ్వక్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో అన్ని పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి.

చూస్తుండగానే టైమ్ గడిచిపోయింది. అర్జున్ కూతురు పెళ్లి కూడా చేసుకొని సినిమాలు తాత్కాలికంగా పక్కనపెట్టింది. విశ్వక్ తన సినిమాలతో బిజీ అయిపోయాడు.

మళ్లీ ఇన్ని రోజులకు మరోసారి వార్తల్లోకెక్కాడు అర్జున్. తన దర్శకత్వంలో ‘సీతా పయనం’ అనే సినిమాను ఎనౌన్స్ చేశాడు. దీంతో మరోసారి అర్జున్ పాత సినిమా చర్చకొచ్చింది.

గతంలో విశ్వక్ సేన్ తో తీయాలనుకున్న సినిమాలోలో కథ హీరోయిన్ పాయింట్ లో నడుస్తుంది. ఇప్పుడు ‘సీతా పయనం’ అనే టైటిల్ తో సినిమా ప్రకటించడంతో, ఇది కూడా ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ అనే విషయం తెలుస్తూనే ఉంది.

మరి ఆగిపోయిన ఆ సినిమా కథనే అర్జున్ మరోసారి తెరపైకి తెస్తున్నాడా? తన కూతుర్నే హీరోయిన్ గా పెట్టబోతున్నాడా? ఈసారి హీరోగా ఎవర్ని తీసుకోబోతున్నాడు?

ఇలా ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అనుమానాలు. అయితే ప్రస్తుతానికి వీటికి సమాధానాల్లేవ్. ఈ సినిమాను తనే డైరక్ట్ చేస్తూ, తనే నిర్మిస్తూ తీయబోతున్నాడు అర్జున్. త్వరలోనే నటీనటుల వివరాలతో ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు. అప్పటివరకు సస్పెన్స్.

2 Replies to “ఇది ఆ సినిమాయేనా అర్జున్..?”

Comments are closed.