ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీబీఎస్ మూడో విడత కౌన్సెలింగ్ జాప్యమవుతోంది. దీంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకుంది. ఇప్పటికే రెండో విడతల్లో కౌన్సెలింగ్ పూర్తయ్యింది. ఈ నెల 14 నుంచి ఎంబీబీఎస్ మొదటి ఏడాది విద్యార్థుల తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో మూడో విడతలో సీట్లు వస్తాయో, రావో అనే ఆందోళన విద్యార్థుల్లో నెలకుంది.
కొంత మంది విద్యార్థులు ఇప్పటికే బీడీఎస్‌లో చేరారు. కనీసం మూడో విడతలో అయినా సీట్లు దక్కుతాయనే ఆశతో విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మూడో విడత కౌన్సెలింగ్ కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం ఈ దఫా కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉండడమే. 600కు పైగా మార్కులు వచ్చిన వాళ్లు 2 వేల మందికి పైగా విద్యార్థులున్నారు. గత ఏడాది 900 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నట్టు విద్యార్థులు చెబుతున్నారు.
ఈ దఫా కొత్తగా ఐదు మెడికల్ కళాశాలలు వచ్చినట్టే వచ్చి, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వెనక్కి వెళ్లాయి. ఐదు కళాశాలలు ప్రారంభమై ఉంటే సుమారు 750 సీట్లు అదనంగా వచ్చేవని విద్యార్థులు వాపోతున్నారు. కానీ ప్రభుత్వం కేవలం పాడేరు కళాశాలను మాత్రమే, అది కూడా 50 సీట్లతో ప్రారంభించడాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
మరోవైపు తెలంగాణలో మూడో విడత కౌన్సెలింగ్ పూర్తయింది. ఏపీలో కాకపోవడం, ఒకట్రెండు రోజుల్లో సీట్లు అలాట్‌మెంట్ జరగొచ్చనే ప్రచారం ఎప్పుడు నిజమవుతుందా? అని విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఎన్‌సీసీ కోటాలో మెరిట్ జాబితాను విడుదల చేసినప్పటికీ, సీట్ల కేటాయింపు చేయకపోవడంపై కూడా విమర్శలొస్తున్నాయి. కావున ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని, త్వరగా మూడో విడతలో సీట్ల కేటాయింపు చేయాల్సిన అవసరం ఉంది.
బిల్డింగ్స్ లేకపోయినా,కనీసం చెట్లకింద MBBS క్లాస్ లు చెపుదాం అనుకుంటే.. జెగ్గులు గాడి పర్యటన వల్ల అవి కూడా కొట్టేసారు.. మరి LABS విషయం అస్సలు అడగొద్దు