బూరుగుపల్లి శివరామకృష్ణ, ఈ పేరు టాలీవుడ్ జనాలకు పరిచయమే. నిర్మాతగా అంటే ఎప్పుడో తీసిన సాహసవీరుడు సాగరకన్య సినిమా పేరు చెబితే గుర్తు వస్తుంది. తరువాత ఒకటి అర సినిమాలు తీసినా పెద్దగా ముందుకు వెళ్లలేదు. కానీ సినిమా ఇండస్ట్రీ సంఘాల్లో పదవులు మాత్రం బాగానే నిర్వహించారు. కొందరు పెద్దలకు బినామీగా ఈ పదవుల్లో వుంటూ, వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేవారు అని టాక్ వుండేది. ఈ విషయాలు అన్నీ ఇలా వుంచితే ఇప్పటికే ఒకసారి ఇదే బూరుగుపల్లి శివరామకృష్ణ భూ తగాయిదా కేసులో అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇది రెండోసారి.
ఈసారి జరిగిన భూమి విక్రయాల నకిలీ పత్రాల తయారీ, వాటి అధారంగా భూములు సంపాదించే పథకం చిరకాలంగా నడుస్తోంది. ఇది ఇప్పటిది కాదు. హైకోర్టు అక్కడి నుంచి సుప్రీం కోర్టుకు వెళ్లింది. సుప్రీం కోర్టులో పత్రాలు నకిలీవి అని తేలడంతో తీగలాగారు. దాంతో ప్రభుత్వ ఆర్కైవ్స్ శాఖ వరకు సాగింది ఈ తీగ. అంతర్గత విచారణ జరిపి బూరుగుపల్లి శివరామకృష్ణకు సహకరించిన వారిని సైతం ఇప్పుడు అరెస్ట్ చేసారు.
ఇదిలా వుంటే రాయదుర్గం పరిధిలో వున్న మహాప్రస్ధానం సమీపంలో ఈ భూములు వున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి ఇప్పటికే కొన్ని విక్రయ అగ్రిమెంట్ లు చేసేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కీలకమైన చోట్ల భూములు వుండడంతో, టాలీవుడ్‌తో సంబంధాలున్న పెద్దలు కొందరు అగ్రిమెంట్ లు చేసుకుని, పెద్ద మొత్తాలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ఇలా భూముల కోసం డబ్బులు ఇచ్చిన వారో లేదా అగ్రిమెంట్ లు చేసుకున్న వారిలో ఓ స్టూడియో అధినేత, ఓ బడా ఫైనాన్సియర్, రాబోయే ఓ గ్లోబల్ రేంజ్ పాన్ ఇండియా సినిమా నిర్మాత తదితర పెద్దలు పలువురు వున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎంత వరకు నిజమో తెలియాలంటే ఈ తీగను మరింత బలంగా లాగితే తప్ప తెలియదు.
vc estanu 9380537747
vc estanu 9380537747
Is it true Bhavani?
No Publicity is Bad Publicity…
Premante idera tammudu yuvaraju daruvu producer ithanu
vc available 9380537747