ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఎంతగా ఒక కుదుపు కుదిపిందో అందరికీ తెలుసు. ఆ వ్యవహారం ఇంకా పూర్తిగా ముగిసిపోలేదు. దీపావళి లోగానే తెలంగాణలో రాజకీయ బాంబులు పేలుతాయని, రాజకీయ ప్రముఖులు అరెస్టు అవుతారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన మాటల ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ముడిపడిన వారిని కూడా అరెస్టు చేస్తారేమో అనే అనుమానం పలువురిలో కలుగుతోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.. ఇప్పుడు ఉల్టా కాంగ్రెస్ మీదనే అవే ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ సర్కారులోని మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా ప్రతిపక్ష్క్ష నాయకుల ఫోను సంభాషణల్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వింటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.
సవాళ్లు విసరడం అనేది రాజకీయ నాయకులకు ఒక సరికొత్త ఫ్యాషన్! సవాలుకు నిలబడడం అనేది ఏ ఒక్కరూ చేసే పని కాదు. అందరూ సవాళ్లు విసురుతూనే ఉంటారు. ప్రత్యేకించి.. ఫోన్ ట్యాపింగ్ అనే పదానికి అత్యంత పాపులారిటీ మాత్రం భారాస ప్రభుత్వం పుణ్యంగానే దక్కింది. వారి పాలనలో కేవలం రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు.. సినిమా వ్యాపార సెలబ్రిటీల ప్రెవేటు సంభాషణలు కూడా వింటూ.. వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ అనేక రకాల అనుచిత మార్గాల్లో లబ్ధి పొందారనే ఆరోపణలు బీఆర్ఎస్ వారిపై ప్రముఖంగా వినిపించాయి.
బిఆర్ఎస్ నాయకులు ఫోన్ ట్యాపింగ్ సంభాషణలు విన్నటువంటి ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్ మంత్రులు కూడా ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గానికి పాల్పడుతూ వచ్చిన ప్రభుభక్తిపరులైన ఐపీఎస్ అధికారులు, ఇతర పోలీసులు హార్డ్ డిస్కులు, ఇతర ఆధారాలు అన్నీ తీసుకువెళ్లి వాటిని ధ్వంసం చేసేయడానికి ప్రయత్నించిన సంగతి వరకు ధ్రువపడింది. అంటే.. భారాస హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన సంగతి ఖరారుగా లెక్కతేలింది. ఆ ట్యాపింగ్ చేసినది ఎవరో కూడా తేలింది. చేయించినది ఎవరు? అనేదొక్కటే పెండింగు ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరి ఫోను సంభాషణలు వింటున్నారంటూ కేటీఆర్ ఆరోపించడం చిత్రంగా ఉంది. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అనే సామెతకు అనుగుణంగానే ఆయన వ్యవహార సరళి ఉన్నదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రేవంత్ ట్యాపింగ్ చేయించడం లేదు అంటే.. తనతోపాటు మీడియా కెమెరాల ముందు లైడిటెక్టర్ పరీక్షలకు హాజరు కావాలని ఆయన అంటున్నారు.
భారాస హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన సంగతి ధ్రువపడింది.. కాంగ్రెస్ హయాంలో జరుగుతున్నది అనేది కేవలం ఆరోపణ దశలో ఉంది. అలాంటప్పుడు ముందు కేటీఆర్ ఒక లైడిటెక్టర్ పరీక్ష తీసుకుని.. తాము పరిశుద్ధులం అని నిరూపించుకుని ఆ తర్వాత రేవంత్ కు సవాలు విసిరితే బాగుంటుంది కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ముక్కోడు , డ్రామా రావు గాడు సమంత , రకుల్ అనేక మంది జీవితం నాశనం చేసాడు , గొర్రెల స్కాం , కార్ రేస్ స్కాం , ధరణి స్కాం , మేడిగడ్డ స్కాం , దళితులకు 2 బెడ్ రూమ్ స్కాం , లిక్కర్ స్కాం , రియల్ ఎస్టేట్ స్కాం , ఫోన్ టాపింగ్ స్కాం ఇలా నీచుడు జగన్ రెడ్డి తో పోటీ పడి నీచంగా డబ్బు సంపాదించి నోటికొచ్చింది వాగుతున్నాడు
vc available 9380537747
పొట్టి నా తూ
కే టి అర్ కూడా తన చెల్లెలు కన్నా వేయిరెట్లు.. మంచోడు. లిక్కర్ స్కాం తెలిసిందే కదా. అప్పటి ఆంద్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడి ఫోన్ నే ట్యాపింగ్ చేసారంటే, పదేళ్లు ఏ ఒక్కడిని వదల్లేదు. ఇజ్రయిలు దేశం నుండి సాఫ్ట్వేర్ కొన్నారు. రాష్ట్రంలో అన్ని చోట్లా పొలిసు సిబ్బందిని నియమించి మాటలు విన్నారు. సిబ్బంది లో ఎవరు, ఎక్కడ, ఏ పని చేస్తున్నారో, లంచాలు వసూళ్లు చేస్తున్నారో పోలీసుశాఖ ఉన్నతాధికారులకు తెలియకుండా జరగదు. నిప్పులేకుండా పొగ రాదని అందరికి తెలుసు.. అయినా, సింహం తాను శుద్ధ శాఖాహారిని అని ప్రకటిస్తే, అందరూ జై కొడతారు. వేరే గత్యంతరం లేదు.