చివరిసారి న్యూజిలాండ్ ఇండియాలో టెస్ట్ మ్యాచ్ గెలిచింది 1988లో! అని ఇండియా- కివీస్ జట్ల మధ్యన టెస్ట్ సీరిస్ ప్రారంభానికి ముందు గణాంకాలు చెప్పాయి. చివరిసారే కాదు, తొలి సారి కూడా అదే! ఇండియాలో టెస్ట్ మ్యాచ్ లను ఆడటానికి వచ్చిన విదేశీ జట్లు ఒక్కో దశలో ఒక్కోటి గట్టి పోటీ ఇచ్చాయి.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక, పాకిస్తాన్.. ఇలా విదేశీ జట్లు ఒకానొక దశల్లో ఇండియాలో టెస్టు మ్యాచ్ లలో గట్టి పోటీని ఇచ్చాయి. కొన్ని సార్లు అవి సీరిస్ విజయాలను కూడా సాధించాయి. అయితే కివీస్ ను మాత్రం ఇండియా ఎప్పుడూ పసి కూనగానే చూసింది టెస్టుల్లో! వన్డే, టీ20లను మినహాయిస్తే టెస్టుల్లో మాత్రం ఇండియా ఎప్పుడూ న్యూజిలాండ్ ను చిత్తు చిత్తుగా ఓడించేది. అందుకే ఎప్పుడూ న్యూజిలాండ్ తో ఇండియా వేదికగా నాలుగు, ఐదు టెస్టులు కూడా జరగవు. రెండు మూడు టెస్టులే సీరిస్ గా జరుగుతూ ఉంటాయి. మ్యాగ్జిమం మూడు రోజుల వ్యవధిలో ఫలితాలు వచ్చేసిన చరిత్ర ఉంది న్యూజిలాండ్ తో మ్యాచ్ లలో.
ఎప్పుడో 1988లో న్యూజిలాండ్ తొలిసారి టెస్టు మ్యాచ్ గెలిస్తే, ఆ తర్వాత రెండో టెస్టు విజయం చిన్నస్వామి స్టేడియంలో ప్రస్తుత సీరిస్ లో భాగంగా జరిగిన తొలి టెస్టుల మ్యాచ్ తో దక్కింది. ఇలా న్యూజిలాండ్ కు సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాలో టెస్ట్ మ్యాచ్ విజయం లభించింది. అది కూడా టీమిండియాను ఆల్మోస్ట్ చిత్తు కింద కొట్టింది న్యూజిలాండ్ జట్టు.
తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 46 పరుగులకు ఆలౌట్ కావడం మరోసారి నవ్వుల పాలు చేసిన అంశం. ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగేళ్ల కిందట ఇండియా 36 పరుగులకు ఆలౌట్ అయ్యింది ఒక ఇన్నింగ్స్ లో. అంతకన్నా పది పరుగులు ఎక్కువ చేసినా.. స్వదేశంలో టీమిండియాకు అదో చేదు అనుభవం. ఆత ర్వాత రెండో ఇన్నింగ్స్ లో కొంత మేర కోలుకున్నా.. ఇండియా విజయం అయితే సాధించలేదు. కనీసం ఆఖరి సెషన్ వరకూ కూడా మ్యాచ్ ను తీసుకురాలేకపోయింది. తొలి ఇన్నింగ్స్ లో ఏదో పొరపాటు జరిగిందనుకుంటే.. రెండో ఇన్నింగ్స్ లో మ్యారథన్ బ్యాటింగ్ ను చేయాల్సిన అవసరం ఉండింది.
ఏదో సర్ఫరాజ్ ఖాన్ రాణించబట్టి సరిపోయింది కానీ, లేకపోతే ఆ మ్యాచ్ లో టీమిండియా మరింతగా చిత్తయ్యేది. తొలి ఇన్నింగ్స్ లో అంత దారుణంగా అలౌట్ అయ్యాకా.. మ్యాచ్ ను డ్రాగా ముగించేంత బ్యాటింగ్ చేయాల్సిన టీమిండియా ఆటగాళ్లు లేదా ఇది తమ స్వదేశం అని మరిచిపోయారో, లేక టెస్టు బ్యాటింగ్ నే మరిచిపోయారో కానీ.. చేతులెత్తేశారు. చిత్తుగా ఓడిపోయారు. అయితే అది కూడా ఒక మ్యాచ్ వరకే పరిమితం అని అభిమానులు క్షమించేసే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. రెండో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ మరోసారి చేతులు ఎత్తేశారు!
తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు ఒక రకమైన స్కోరే చేయగా, టీమిండియా అందుకు చాలా వెనుకబడింది. కనీసం యాభై ఓవర్ల పాటు టీమిండియా బ్యాటింగ్ చేయలకపోయింది. 45 ఓవర్లకే చాపచుట్టేశారు. 156 పరుగులు చేసి ముక్కిమూలిగారు! వరసగా రెండో మ్యాచ్ లో ఈ ప్రదర్శన చూశాకా.. ఈ మ్యాచ్ లు ఇండియాలోనే జరుగుతున్నాయా లేక న్యూజిలాండ్ లో జరుగుతున్నాయా అనే సందేహం మొదలవుతోంది. న్యూజిలాండ్ వేదికగా జరిగే టెస్టు మ్యాచ్ లలో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఈ తరహాలో చేతులు ఎత్తేస్తూ ఉంటుంది. అయితే తొలిసారి ఇండియాలో కూడా మనోళ్ల ప్రతిభ ఇలా ఉంటుందా అనే ప్రశ్న తలెత్తుతూ ఉంది.
కనీసం ఒక సెషన్ పాటు బ్యాటింగ్ చేయగల బ్యాట్స్ మన్ కాదు, జట్టు మొత్తం కలిసి ఒక సెషన్ ఆడటమే గొప్పగా మారింది. జట్టులో మళ్లీ అరివీర భయంకరులు అంతా ఉన్నారు. అయితే స్కోర్ బోర్డు మాత్రం దారుణంగా కనిపిస్తూ ఉంది. టీమిండియా జట్టు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా.. స్వదేశంలో టెస్టులు ఓడిపోవడం మాత్రం అరుదు! దశాబ్దాలుగా ఇండియా వరకూ స్వదేశీ పులిగా ఇండియా కొనసాగుతూ ఉంది. గత మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ ఇండియా టెస్టుల్లో ఇలాంటి ప్రదర్శన చేయలేదు.
గత మూడు దశాబ్దాల్లోనే ఆస్ట్రేలియా చేతిలో ఒక సారి, ఇంగ్లండ్ చేతిలో ఒకసారి సీరిస్ కోల్పోయినట్టుగా ఉంది టీమిండియా. ఆస్ట్రేలియా చేతిలో కూడా 2004-05 సమయంలో చెన్నైలో టెస్టు గెలిచే పరిస్థితుల్లో వర్షం వల్ల రద్దు కావడంతో.. అప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆ జట్టుకు దక్కింది. ఇంగ్లండ్ ఏదో గాలికి ఒకసారి గెలిచింది.
అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ల మాట ఎలా ఉన్నా.. ఇండియాలో చివరిసారిగా టెస్టు మ్యాచ్ గెలిచే 36 యేళ్లు గడిచిన నేఫథ్యంతో వచ్చిన జట్టు తొలి మ్యాచ్ లో ఇండియాను చిత్తు చేసింది. రెండో మ్యాచ్ లో అదరగొడుతూ ఉంది! టీమిండియా కోచ్ హోదాను గంభీర్ తీసుకున్న తర్వాత ఇది రెండో వార్నింగ్ బెల్. శ్రీలంక పర్యటనలో కూడా వన్డే మ్యాచ్ లలో ఇండియా వరస ఓటములతో సీరిస్ కోల్పోయింది. ఇప్పుడు ఇండియాలో టెస్టు సీరిస్ ను కోల్పోతే ఇదో పెద్ద అవమానకరమైన ఓటమిగా మిగిలిపోతుంది!
ఛ..చివరాఖరికి GA కి కూడా లోకువయిపోయామని, పౌరుషాన్ని తెచ్చుకొని ఈ సాయంత్రానికల్లా 5 wickets తేడాతో 350 పరుగులు కొట్టి గెలిచేస్తారు. – GAmbhir
Exactly, ఈ డాశ్ గాడికి కొంచెం ముట్టె పొగరు.
గంభీర్ బీజేపీ మాజీ ఎంపీ కావడం తో ఇది రాయాలి అనిపించింది ఏమో, లేకపోతే స్పోర్ట్స్ మీద ఆర్టికల్స్ వస్తాయా ఇక్కడ!
Kammaravat erripooku spotted
Ee burra undalante kanisam battayi karyakarta leda pasuspu pushpam ayina ayyundaali
అంటే ఈడు బీజేపీ మాజీ కాబట్టి ఎవరూ ఏమీ అనొద్దు పాపం 🤣
పిచ్చా? బాంగ్లాదేశ్ మీద విజయాలు సాధించినపుడు వీళ్ళు ఏమీ రాయలేదు. ఇప్పుడు ఓడింది కనుక మళ్ళీ అక్కడ ఉన్నది బీజేపీ మాజీ ఎంపీ కనుకనే క్రికెట్ మీద ఆర్టికల్స్ రాయడం అంటున్నాను.
ghambeer gaadu otti suddha panikimaalina edava..vaadini coach gaa teesukunnaarante vademanna eduru sommu katti untaadu ledaa vaccbe jeetam lo kameeshanlu istaamani untaadu..
vc available 9380537747
Call boy jobs available 9989793850