ఏ విచారణా పూర్తి కాలేదు .. బాంబులు ఎలా పేలుతాయి?

ప్రత్యర్థులకు భయం కలిగించడంలో రాజకీయ నాయకులు ఎప్పుడూ ముందుంటారు. వాళ్ళు చెప్పేవాటికి ఆధారాలు ఉన్నాయా లేవా అని ఆలోచించరు. వాళ్ళ లక్ష్యం భయపెట్టడమే. ప్రజల్లో, మీడియాలో చర్చ జరగడమే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి…

ప్రత్యర్థులకు భయం కలిగించడంలో రాజకీయ నాయకులు ఎప్పుడూ ముందుంటారు. వాళ్ళు చెప్పేవాటికి ఆధారాలు ఉన్నాయా లేవా అని ఆలోచించరు. వాళ్ళ లక్ష్యం భయపెట్టడమే. ప్రజల్లో, మీడియాలో చర్చ జరగడమే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గులాబీ పార్టీ పాలన నాటి కాళేశ్వరం సహా పలు ఇరిగేషన్ ప్రాజెక్టులు, టెలిఫోన్ ట్యాపింగ్, ధరణి పోర్టల్ , విద్యుత్ ప్రాజెక్టులు …ఇంకా కొన్ని కూడా ఉన్నాయనుకోండి.

వీటన్నింటిపైనా విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. విద్యుత్ ప్రాజెక్టుల పైన, ఇరిగేషన్ ప్రాజెక్టుల పైనా విచారణ కమిషన్లను కూడా ప్రభుత్వం నియమించింది. విచారణ జరుగుతోంది. ఇప్పటికే చాలామంది అధికారులను కమిషన్లు విచారించాయి. అప్పటి సీఎంను, మంత్రులను ఇంకా విచారించలేదు.

విద్యుత్ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు పంపినా హాజరు కాలేదు. రెండోసారి పంపితే కోర్టుకు వెళ్ళాడు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై విచారణ కమిషన్ నుంచి ఇంకా పిలుపు రాలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇంకా దొరకలేదు. ఏ కుంభకోణం ఇంకా ఓ కొలిక్కి రాకుండానే దీపావళికి ముందే బాంబులు (పెద్ద తలకాయల అరెస్టులు) పేలుతాయని పొంగులేటి ఎలా చెప్పాడో! ఏ ఆధారాలతో చెప్పాడో !

ఆయన దగ్గర నిజంగా సమాచారం ఉందా? భయపెట్టడానికి చెప్పాడా? గతంలో మంత్రి పొంగులేటి గులాబీ పార్టీ కీలక నేతలను నవంబర్ మొదటి వారంలో అరెస్టు చేస్తారని చెప్పాడు. ఇప్పుడేమో దీపావళికి ముందే బాంబులు పేలుతాయని అన్నాడు. ఎందుకు తన స్టేట్ మెంటును ముందుకు జరిపాడు?

రెండు కమిషన్ల విచారణలోనూ అప్పట్లో పనిచేసిన ఉన్నతాధికారులంతా కేసీఆర్ వైపే వేలు చూపించారు. జరిగిన తప్పులకు, పాపాలకు ఆయనదే బాధ్యత అన్నట్లుగా చెప్పారు. కానీ కేసీఆర్ ను ఇప్పటివరకు ఏ కమిషన్ విచారించలేదు. అలాంటప్పుడు కీలక నేతలను దీపావళి లోపే ఎలా అరెస్టు చేస్తారు? అరెస్టు కాకపోవొచ్చు. వాళ్ళ పేర్లు బయటకు వస్తుండొచ్చు.

ఈ మొత్తం పరిస్థితిని రాజకీయంగా ఉపయోగించుకోవాలని కేటీఆర్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రజల్లో సానుభూతి కోసం ట్రై చేస్తున్నాడు. అందుకే ఏం పీకుంటావో పీక్కో అంటున్నాడు. జైలుకెళ్లడానికి భయపడేది లేదని అంటున్నాడు. సాధారణంగా ఇలాంటి మాటలు కేసీఆర్ మాట్లాడాలి. కానీ ఆయన మౌనంగా ఉన్నాడు కదా.

4 Replies to “ఏ విచారణా పూర్తి కాలేదు .. బాంబులు ఎలా పేలుతాయి?”

  1. జగనన్నకు అప్పుడు ఎలా పేలాయో టిల్లు అన్నకి కూడా అలానే పేలుతాయి

Comments are closed.