జాతకాలు చెప్పేది ఆ విద్య నేర్చుకున్నవారే కాదు. ఆ విద్య నేర్చుకోనివారు కూడా చెబుతారు. వారే రాజకీయ నాయకులు. తమ ప్రత్యర్థి పార్టీ నాయకుల జాతకాలు వాళ్ళు చెబుతుంటారు. ఈమధ్య మంత్రి పొంగులేటి కూడా దీపావళిలోపే రాష్ట్రంలో రాజకీయ బాంబులు (అరెస్టులు) పేలుతాయని చెప్పాడు. కానీ ఒక్క బాంబు కాదు కదా అర బాంబు కూడా పేలలేదు.
ఇలా ఉంటాయి రాజకీయ నాయకుల జాతకాలు. ఇప్పుడు బీజేఎల్పీ నాయకుడు యేలేటి మహేశ్వర రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి జాతకం చెప్పాడు. గులాబీ పార్టీ నాయకులు అండ్ కమలం పార్టీ నాయకులు చెప్పే జాతకం ఒక్కటే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు …కూలిపోతుందని. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ రెండు పార్టీల నాయకులు ఇదే పాట పాడుతున్నారు.
తాజాగా యేలేటి రేవంత్ సర్కారు ఊరికే కూలిపోతుందని అనకుండా ఎప్పటి నుంచి ఎప్పటిలోగా కూలిపోతుందో, తరువాత సీఎం ఎవరయ్యే ఛాన్స్ ఉందో కూడా చెప్పాడు. ప్రభుత్వం వచ్చే ఏడాది జూన్ నుంచి డిసెంబర్ లోగా కూలిపోతుందట! ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా కోపంగా, గుర్రుగా, చికాకుగా ఉందట.
సోనియాగానీ, రాహుల్ గానీ చివరకు ప్రియాంకగానీ సీఎంకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడంలేదట. ఇవన్నీ రేవంత్ ను ఉంచరు అనడానికి సంకేతాలట. తగిన ఆధారాలతోనే తాను ఈ జాతకం చెబుతున్నానని యేలేటి ఉవాచ. మంత్రుల్లో ఎక్కువమంది రేవంత్ రెడ్డిని అపోజ్ చేస్తున్నారని చెప్పాడు. వీళ్లంతా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారని చెప్పాడు. ఏతావాతా యేలేటి మాటల సారాంశం ప్రకారం …రేవంత్ పెద్ద అవినీతిపరుడు. ఆయన చేస్తున్న పనులన్నీ అధిష్టానందాకా వెళ్లాయి.
రేవంత్ రెడ్డిని పీకేశాక ఎవరికి సీఎం అయ్యే అవకాశం ఉందో ఇద్దరి పేర్లు చెప్పాడు యేలేటి. ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరొకరు మల్లు భట్టి విక్రమార్క . ఇది కేవలం రాజకీయ కోపంతో చెప్పిన జాతకం మాత్రమే. నిజం కావాలని రూలేం లేదు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎంలను మార్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఒకానొక కాలంలో ఉండేదని, కానీ ఇప్పుడు అలాంటిది ఉండదని అన్నాడు. మరి ఆయన చెప్పింది నిజమవుతుందో, యేలేటి జాతకం నిజమవుతుందో చూడాలి.
జాతకాలూ నేర్చికోకుండా ఒక్క రాజకీయ నాయకులే కాదు మీరు కూడా ఎన్నేసి జాతకాలూ చెప్పారు ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు అన్ని చీదేశాయి
Call boy works 9989793850
Call boy jobs available 9989793850
vc estanu 9380537747