జ‌నం మ‌మ్మ‌ల్ని తిడ్తున్నారు – ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

జ‌నం త‌మ‌ను తిడ్తున్నార‌ని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌హిళ‌ల‌పై వ‌రుస అఘాయిత్యాలు జ‌రుగుతున్నా ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎందుక‌ని నోరు తెర‌వ‌డం లేద‌నే నిల‌దీత వెల్లువెత్త‌డం .. ఆయ‌న్ను…

జ‌నం త‌మ‌ను తిడ్తున్నార‌ని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌హిళ‌ల‌పై వ‌రుస అఘాయిత్యాలు జ‌రుగుతున్నా ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎందుక‌ని నోరు తెర‌వ‌డం లేద‌నే నిల‌దీత వెల్లువెత్త‌డం .. ఆయ‌న్ను తీవ్రంగా ఆవేద‌న‌కు గురి చేసింది. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నుల శంకుస్థాప‌న‌కు వెళ్లిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ … అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగిస్తూ తీవ్ర ఆవేద‌న‌, ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

చిన్నారులు, మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, హ‌త్య‌లు జ‌రుగుతున్నాయ‌ని వాపోయారు. త‌మ‌ను జ‌నం తిడుతున్నార‌ని, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేస్తున్నార‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో త‌న‌ను అరెస్ట్ చేయ‌డానికి ఉత్సాహం చూపిన పోలీసులు, ఇప్పుడు నేర‌స్తుల్ని పట్టుకోడానికి ఎందుకు ముందుకు రావ‌డం లేద‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు.

హోంశాఖ‌ను తాను అడ‌గ‌లేక కాదు, తీసుకోలేక కాదని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. హోంశాఖను తాను తీసుకుంటే ప‌రిస్థితులు వేరుగా వుంటాయని ప‌వ‌న్ హెచ్చ‌రించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో యోగి ఆదిత్య‌నాథ్‌లాగా క‌ఠినంగా వుండాలన్నారు.

గ‌త ప్ర‌భుత్వంలో మాదిరిగా అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించొద్దని అధికారుల్ని ప‌వ‌న్ కోరారు. కూట‌మిలో త‌మ పొత్తును విడ‌గొట్ట‌లేరని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కొంద‌రు వ్య‌క్తుల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తును విచ్ఛిన్నం చేసుకోలేమ‌ని గుర్తించాల‌న్నారు. వైసీపీ నాయ‌కులంటే గౌర‌విస్తాన‌ని ప‌వ‌న్ తెలిపారు. వాళ్లు కూడా అదే ర‌కంగా ఉండాల‌ని ఆయ‌న విన్నవించారు. కాదు, కూడ‌ద‌ని వైసీపీ నాయ‌కులు అనుకుంటే, ఆ త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాల గురించి త‌న‌ను అడ‌గొద్ద‌ని ప‌వ‌న్ హెచ్చ‌రించారు.

20 Replies to “జ‌నం మ‌మ్మ‌ల్ని తిడ్తున్నారు – ప‌వ‌న్‌క‌ల్యాణ్‌”

      1. తెలంగాణలో ఇలాగే తాను encounter specialist నంటూ పెట్రేగి, నలుగురు అర్భకులను కాల్చి చంపి, జనాల నీరాజనాలందుకొని, human rights commission తగులుకోగానే తనకేమీ సంబంధం లేదని చెప్పి ముసుగు తన్ని పడుకున్నాడు.

  1. సనాతన ముసుగులో బ్రాహ్మణా /north పెత్తనం వద్దు., ఏ బాష ని తక్కువ చెయ్యొద్దు…. సనాతన నీ అందరం ముందుకి తీసుకెళ్దాం…

  2. రేణుదేశాయ్పి తో పిల్లల్ని పెళ్లి కాకుండానే కన్నాడు, అన్న lezenva తో కూడా అలానే చేసాడు, రేణుదేశాయ్ ఇంటర్వ్యూ లో చెప్పి ఏంతో కుమిలిపోయింది. ఇతను మనకి ఆదర్శమా? ఇంకా ఇలాంటివి ఎన్ని చేసాడో చేస్తున్నాడో పూనమ్ కౌర్ చేపిందిగా ? ఇదేనా ని సనాతన ధర్మం ఊరిమీద పడి కడుపులు చైయ్యటం ఏమన్నా అంటేన వ్యక్తి గతం అనటం, ఏంటిరా పావలా ఇతింగరి గాలి గబ్బు పనులు!! మనకుటుంభంలో ఇలానే చెబుదామా అమ్మ మీఇష్టం వచ్చిన వాళ్లతో తిరగండి పిల్లలు పుడితే అప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయించుకుందాం అని? పిల్ల పావలా సొంత కూతుర్ని కూడా రాజకీయాలకి వాడుకుంటున్నాడు ఇంకా ఏమిచెబుతం!!

Comments are closed.