తెలంగాణ రాజకీయాలు సీఎం రేవంత్ రెడ్డి చుట్టే తిరుగుతున్నాయి. అది సహజం కూడా. గులాబీ పార్టీకి అండ్ కమలం పార్టీకి రేవంత్ రెడ్డి బద్ధ శత్రువు. గులాబీ పార్టీకైతే చెప్పక్కరలేదు. రేవంత్ ఎంత తొందరగా దిగిపోతాడా అని ఆ పార్టీ ఎదురు చూస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ఆ పార్టీ తాపత్రయపడుతోంది.
అలా జరిగితే సహజంగానే కేసీఆర్ సీఎం అవుతాడు. ఏదైనా కారణాలవల్ల అలా కాకపొతే కొడుకు కేసీఆర్ కుర్చీ మీద కూర్చుంటాడు. అంతే తప్ప మరొకరు సీఎం అయ్యే అవకాశం లేదు. కాంగ్రెస్ సీనియర్లలో ముఖ్యంగా మంత్రుల్లో రేవంత్ రెడ్డి పట్ల లోలోపల వ్యతిరేకత ఉన్నా బయటకు మాత్రం మరో నాలుగేళ్లు రేవంతే సీఎం అని ఒకాయన అంటాడు. వచ్చే పదేళ్లు కూడా సీఎంగా రేవంతే ఉంటాడని ఇంకొకాయన అంటాడు.
మొన్నీమధ్య బీజేపీ నాయకుడు యేలేటి మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం జూన్ తరువాత తొలగిస్తుందని, ఆయన తరువాత భట్టి విక్రమార్కకు లేదా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అవకాశం ఉంటుందని అన్నాడు. ఇలా ఎవరికీ తోచింది వాళ్ళు చెబుతున్నారు. ఎవరికి వచ్చిన జాతక విద్యను వారు ప్రదర్శిస్తున్నారు.
సందట్లో సడేమియాలాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డే చివరి అగ్రవర్ణ ముఖ్యమంత్రి అన్నాడు. ఆయన తరువాత బీసీ సీఎం వస్తాడని ఆయన అభిప్రాయం. అలా జరుగుతుందా అంటే చెప్పలేం. రాజకీయాల్లో ఏదీ నాయకులు చెప్పినట్లు లేదా వాళ్ళు ఆశించినట్లు జరగదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అలా జరిగే అవకాశం లేదు.
అంతా ఆ పార్టీ ఢిల్లీ నాయకుల చేతుల్లో ఉంటుంది. వాళ్ళు రకరకాలుగా కూడికలు, తీసివేతలు, భాగహారాలు , గుణకారాలు చేసుకొని సీఎంను డిసైడ్ చేస్తారు. తీన్మార్ మల్లన్న జోస్యం చెప్పినంత మాత్రాన అది నిజమయ్యే ఛాన్స్ లేదు. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రాగానే ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానని, తాను కాపలా కుక్కలా ఉంటానని కేసీఆర్ చెప్పాడు.
కానీ తెలంగాణా వచ్చాక వేరేవాళ్లు సీఎం అయితే రాష్ట్రం ఆగమవుతుందని చెప్పి తానే కుర్చీలో కూర్చున్నాడు. ఆయన తరువాత కేటీఆర్ అవుతాడు తప్ప మరొకరికి ఛాన్స్ ఉండదు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ కాలం కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పడు సీఎం అయినవారిలో అత్యధికులు రెడ్లు. కమ్మవారు తక్కువ.
వెలమల్లో ఒకాయన, బ్రాహ్మణుల్లో ఒకాయన సీఎం అయ్యాడు. బీసీల నుంచి ఇప్పటివరకు ఒకాయనే సీఎం అయ్యాడు. ఉమ్మడి రాష్ట్రంకంటే ముందు ఆంధ్ర రాష్ట్రం ఉండేది. అక్కడా సీఎంలు అయిన ఇద్దరూ అగ్రవర్ణాలవారు. విభజన తరువాత తెలంగాణలో సీఎంలు అయిన కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరూ అగ్రవర్ణాలవారే. అటు ఏపీలోనూ సీఎంలు అయిన చంద్రబాబు అండ్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ అగ్రవర్ణాలవారే. కాబట్టి రెండు రాష్ట్రాల్లోనూ బీసీలకు అవకాశం వస్తుందా అంటే చెప్పలేం.
అంబేద్కర్ హిందూ మతంలో కులం వద్దు అన్నాడు.. మిగతావి అయన అంగీకరించాడు.. ఆయన విదేశీ మతాలను పూర్తిగా విభేధించాడు..
దేశ ద్రోహి – బ్రిటిష్ కుక్క – పెంచుకున్న కూతుర్ని (నాన్న అనిపించుకొని) పెళ్లి చేసుకున్న పెరియార్.. fake ambedkaristlu ఆయన వారసులు.. అంబేద్కర్ పేరు వాడొద్దు..
అంబేద్కర్ హిం..దూ మ..తంలో కు..లం వద్దు అన్నాడు.. మిగతావి అయన అంగీకరించాడు.. ఆయన విదేశీ మతాలను పూర్తిగా విభేధించాడు..
దేశ ద్రో..హి – బ్రి..టిష్ కు..క్క – పెంచుకున్న కూతుర్ని (నాన్న అనిపించుకొని) పెళ్లి చేసుకున్న పెరియార్.. fake ambedkaristlu ఆయన (పెరియార్) వారసులు.. అంబేద్కర్ పేరు వాడొద్దు..
Call boy works 9989793850
AP ki kudaa ex- bo ku CM jagan ne chivari vaadu….LOL
ఎవరకు ఎక్కువ తెలివి+ డెడికేషన్ ఉంటుందో..వాళ్ళు ముఖ్య మంత్రులు కావాలి సామీ…కులం , మతం బేసిక్ కాకుండా…
ఇప్పటికే రెండు రాష్ట్రాలు చంక నాకి పోయాయి… వీటిని ఒక మంచి డైరెక్షన్ లో నడిపించే నాయకులు కావాలి కాని…తెలివి తక్కువ దద్దమ్మ లు వొద్దు..
అదే మంచిది .. వేలకు వేలకోట్లు ఎన్నికల్లో ఖర్చుపెట్టుకొనే దరిద్రం తప్పుతుంది
vc available 9380537747
Next CM Sanjay
Jagan Mohan Reddy BC-D kada. Converted Christians are comes under BC..kaadaa