అమ‌రావ‌తిలో క‌రెంట్‌కు అంత‌రాయం వుండొద్ద‌ని…!

కూట‌మి ప్ర‌భుత్వానికి రాజ‌ధాని అమ‌రావ‌తి అత్యంత ప్రాధాన్య అంశం. రాజ‌ధాని అభివృద్ధి త‌ర్వాతే, ఏదైనా, ఏమైనా అన్న‌ట్టుగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న టాక్ లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో అమ‌రావ‌తిలో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం అనేదే లేకుండా…

కూట‌మి ప్ర‌భుత్వానికి రాజ‌ధాని అమ‌రావ‌తి అత్యంత ప్రాధాన్య అంశం. రాజ‌ధాని అభివృద్ధి త‌ర్వాతే, ఏదైనా, ఏమైనా అన్న‌ట్టుగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న టాక్ లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో అమ‌రావ‌తిలో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం అనేదే లేకుండా చూడాల‌ని ప్ర‌భుత్వం యోచించింది.

ఇందులో భాగంగా తాళ్లాయపాలెంలో 400/ 220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ స‌బ్‌స్టేష‌న్ (జీఐఎస్‌)ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్రారంభించారు. ఇదే సంద‌ర్భంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని విద్యుత్ ప్రాజెక్ట్‌ల‌కు సీఎం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాప‌న చేశారు.

అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణంపై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపు తుండ‌డంతో నాణ్య‌మైన‌, కోత‌లేని విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో వుంది. రాజ‌ధాని ప్రాంతాన్ని నాలుగేళ్ల‌లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయ‌డానికి శ‌ర‌వేగంగా ప‌నులు చేయ‌త‌ల‌పెట్టారు. ఇందుకోసం వేల కోట్ల రూపాయిల్ని అప్పుగా కూడా తీసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే.

భ‌విష్య‌త్‌లో పాల‌కులు ఎవ‌రొచ్చినా రాజ‌ధానిని మార్చ‌డానికి వీల్లేని విధంగా నిర్మించాల‌నేది కూట‌మి ప్ర‌భుత్వ ఆలోచ‌న‌. అందుకు త‌గ్గ‌ట్టుగా అభివృద్ధి ప‌నుల్ని రాజ‌ధాని ప్రాంతంలోనే చేస్తున్నారు. ఇక మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి విష‌యానికి వ‌స్తే, మూడు, నాలుగు ప్రాధాన్య‌త‌ల కిందికి వ‌స్తాయి.

7 Replies to “అమ‌రావ‌తిలో క‌రెంట్‌కు అంత‌రాయం వుండొద్ద‌ని…!”

  1. మీకు మిగిలిన ఒకే ఆప్షన్ ఇలా ఏడ్చి ఏడ్చి సచ్చిపోవడం… అంతకు మించి ఒక వెంట్రుక కూడా పీక్కోలేరు

  2. “రాజ‌ధాని అభివృద్ధి త‌ర్వాతే, ఏదైనా, ఏమైనా అన్న‌ట్టుగా”..che ddi batch started planting…

    hopefully andhra people learnt their lesson from 2019.

  3. మనం ఎక్కడా ఏమి చెయ్యలేదు. వీళ్ళు కనీసం అమరావతి లో ఎదో చేస్తున్నారు. చెయ్యనీయబ్బ

Comments are closed.