చిరకాలంగా సెట్ మీద, వార్తల్లో మాత్రమే వుంటూ వస్తోంది రామ్ చరణ్- శంకర్ ల గేమ్ ఛేంజర్ సినిమా. విడుదల డేట్ ఫిక్స్ అయింది, సంక్రాంతికి వస్తోంది. నిర్మాత దిల్ రాజును కాస్త టెన్షన్ కు గురి చేసిన మాట వాస్తవం. మిగిలిన సినిమాల మాదిరిగా ఈ సినిమా నిర్మాత కంట్రోల్ లో లేదు. అంతా దర్శకుడు శంకర్ కంట్రోల్ లోనే.
ఇప్పటి వరకు కంటెంట్ విడుదల విషయంలో ఫ్యాన్స్ లో అసంతృప్తి వుంది. దేవర సినిమా హిట్ అయిన నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ టర్న్ వచ్చింది ఇప్పుడు. ఇది వాళ్లకు చాలా ప్రతిష్టాత్మక చిత్రం, పెద్దగా పోటీ లేకుండానే సంక్రాంతి బరిలోకి దిగుతోంది.
గేమ్ ఛేంజర్ మీద ఊహాగానాలు వున్నాయి తప్ప సినిమా ఎలా వుండబోతోందో తెలియదు. ఇలాంటి నేపథ్యంలో టీజర్ వస్తోంది. గేమ్ ఛేంజర్ టీజర్ ను లక్నో లో విడుదల చేయడం ద్వారా ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. దేశ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు ప్లాన్ చేసారు. అమెరికాలో కూడా ఓ ఈవెంట్ ప్లాన్ చేసారు. వీటన్నింటికీ లీడ్ టీజర్ లాంచింగ్ నే.
టీజర్ కచ్చితంగా అకట్టుకోవాలి, అంచనాలు పెంచాలి. సినిమా మీద ఫ్యాన్స్ హోప్ పెట్టుకునేలా వుండాలి. టీజర్ ను దాదాపు 100 సెకెండ్లకు కాస్త అటు ఇటుగా కట్ చేసినట్లు తెలుస్తోంది. అన్ ప్రిడిక్టబుల్ అనే డైలాగు టీజర్ లో సరైన స్లాట్ లో సరైన విధంగా వినిపిస్తుందని తెలుస్తోంది. మొత్తం మీద టీజర్ మీదే అధారపడి వుంది గేమ్.. ఛేంజ్ కావడం అన్నది.
Call boy works 9989793850
Ott lo chustham
vc estanu 9380537747
Call boy jobs available 9989793850