వ‌లంటీర్ల‌కు చివ‌రికి మిగిలింది…!

ఎన్నెన్నో అనుకుంటుంటాం.. అవ‌న్నీ జ‌రుగుతాయా? అన్న‌ట్టుగా వ‌లంటీర్ల విష‌యంలో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 ల‌క్ష‌ల‌ పైబ‌డి వ‌లంటీర్లు భ‌విష్య‌త్ ఏమిటో తెలియ‌క అల్లాడుతున్నారు. ఐదేళ్ల పాటు నెల‌కు కేవ‌లం రూ.5 వేల…

ఎన్నెన్నో అనుకుంటుంటాం.. అవ‌న్నీ జ‌రుగుతాయా? అన్న‌ట్టుగా వ‌లంటీర్ల విష‌యంలో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 ల‌క్ష‌ల‌ పైబ‌డి వ‌లంటీర్లు భ‌విష్య‌త్ ఏమిటో తెలియ‌క అల్లాడుతున్నారు. ఐదేళ్ల పాటు నెల‌కు కేవ‌లం రూ.5 వేల గౌర‌వ వేత‌నంతో అద్భుత‌మైన సేవ‌లు అందించారు. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌తో రాజ‌కీయంగా వైసీపీకి న‌ష్టం వ‌చ్చింది. కానీ జ‌నానికి మాత్రం మంచే జ‌రిగింది.

ఎన్నిక‌ల్లో వ‌లంటీర్లు వైసీపీకి అండ‌గా నిలిస్తే, త‌మ‌కు రాజ‌కీయంగా న‌ష్టం వ‌స్తుంద‌ని భ‌యప‌డ్డ చంద్ర‌బాబు… వాళ్ల‌ను త‌న వైపు తిప్పుకునేందుకు అస్త్రాన్ని సంధించారు. రూ.5 వేలు కాదు… తానే సీఎం అయితే రూ.10 వేలు ఇస్తాన‌ని న‌మ్మ‌బ‌లికారు. దీంతో వ‌లంటీర్లు కూట‌మి గెలుపు కోసం గ‌ట్టిగా ప‌ని చేశారు.

కూట‌మికి అధికారం ద‌క్కింది. వ‌లంటీర్ల‌కు ఉపాధి పోయింది. పుండుపై కారం చ‌ల్లిన‌ట్టుగా ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ కామెంట్స్ చేశారు. అస‌లు వ‌లంటీర్ల‌కు సంబంధించి చ‌ట్ట‌బ‌ద్ధంగా ఎలాంటి జీవో లేద‌ని చెప్పి, ఇక వ్య‌వ‌స్థ‌ను మ‌రిచిపోవ‌డ‌మే మంచిద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వ అభిప్రాయాన్ని ఎట్ట‌కేల‌కు వెల్ల‌డించారు.

ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌లో శ‌నివారం వ‌లంటీర్ల ఆవేద‌న స‌భ నిర్వ‌హిస్తుండ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. చంద్ర‌బాబు హామీని నిల‌బెట్టుకునేలా ఒత్తిడి చేయ‌డం ఈ స‌ద‌స్సు ముఖ్య ఉద్దేశం. అయితే ఇలాంటి ఒత్తిళ్ల‌కు చంద్ర‌బాబు త‌లొగ్గే ర‌కం కాద‌ని వాళ్ల‌కు తెలిసిన‌ట్టు లేదు. వ‌లంటీర్లంతా ఒక‌చోట చేరి. ఒక‌రికొక‌రు ఓదార్చుకోడానికి త‌ప్ప‌, ఒరిగేదేమీ వుండ‌ద‌ని కూట‌మి నేత‌లు అంటున్నారు. ఆవేద‌న స‌భ ఏదైనా కార్యాచ‌ర‌ణ తీసుకుంటే మాత్రం ప్ర‌భుత్వానికి చికాకు త‌ప్ప‌దు. లేదంటే వ‌లంటీర్ల‌కు ఉపాధి లేన‌ట్టే.

68 Replies to “వ‌లంటీర్ల‌కు చివ‌రికి మిగిలింది…!”

  1. ఈ వ్యవస్థ వల్ల … సాధించాల్సిన వయస్సులో… 5k కే సంతృప్తి పడి… విలువైన భవిష్యత్తుని పోగొట్టుకున్న అభాగ్యులు వీరు

    1. పోనీ ఇప్పుడు ఇవ్వండి ఆ భవిషత్తు ఏదో atleast చెప్పండి మీరు.

      వాళ్ళు ఇలా పోగొట్టుకున్నారో మీరు చెప్పండి మల్లి తెచ్చుకుంటారు భవిషత్తు

      వాలంటీర్ ఏమీ మైనర్ బాలికలు కారు మాయ మాటలు చెబితే 5 వేలకి పని చేసేకి.

      1. ఎవడూ ఎవడికీ భవిష్యత్తు ఇవ్వడు. అది ఎవడికి వాడే వెతుక్కోవాలి.. ఎవడినీ నమ్మకూడదు… అది ఎవడైనా… CBN / jagan / Pawan …. లేదా వేరే ఎవరైనా… మన స్కిల్స్ పెంచుకుంటూ మనం ఏమి చేస్తే సంపాదించుకోగలమో తెలుసుకుని … ఎవరినీ మోసం చేయకుండా పని చేసుకుని బ్రతకాలి.

    2. వాలంటీర్ జాబ్ అనేది iit లో చదివిన వాళ్ళ కోసం కాదు వాళ్ళేదో విలువైన భవిష్యత్ని పోగొట్టుకున్నారు అనుకోవటానికి. ఇంటర్ పాస్ అయ్యి ఊళ్ళోనే ఉండి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి ఆ ఐదు వేలు వేన్నీళ్ళకి చన్నీళ్లు సాయం అంతే. మరీ అంత హెవీ వర్క్ ఉండదు, 5 వేలు సరిపోతుంది. పెరిగిన ధరల దృష్ట్యా 7 లేదా 8 వేలు ఇస్తే సరిపోతుంది.ఆ ఐదు వేలు పోగొట్టుకుని ఇప్పుడు అభాగ్యులు అయ్యారు వాళ్ళు😔

      1. No Sir. Naaku personal gaa తెలిసిన ముగ్గురు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు… మా రిలేషన్స్ నే… జాబ్స్ వెత్తుక్కోకుండా ఈ వాలంటీర్ జాబ్ కి అంకితం అయ్యారు. వారి fresher status కోల్పోయారు. ఇప్పుడు కోడింగ్ నేర్చుకోవడానికి కూడా స్ట్రగుల్ అవుతున్నారు. ఇది నాకు పర్సనల్ గా తెలిసిన విషయం. తెలియనివి ఇంకెన్ని ఉన్నాయో

  2. పాపం ఎలాంటి assurance లేకుండా 5yrs గొడ్డు చాకిరీ చేయించుకుని ,చివరికి గాలికి వదిలేశారని court కి వెళ్ళమని చెప్పు GA….

  3. వాలంటీర్ వ్యవస్థ అనయ్యం ఊరికి ఒకడు ఉంటే చాలు వానికి 10 వెలు ఇస్తే అన్ని విధాల సరిపోయేది .అది కాదనై ఇలా ఊరికి 100 మందిని పెట్టి అందరినీ సంక నకించాడ్.పాలన లో ఒక్కటి తిన్నగా చెయ్య లేదు

  4. ఓరికి 12మంది సచివాలయం స్టాఫ్ . వలలో చాల మంది కి ఎలాంటి వర్క్ ఉండదు ఎలాగు .నాలుగు విలేజ్ లక్ ఒక సచివాలయం సరిపోతుంది అని వృధా ఖర్చు లు . మలల్ ఒక్కోటి రెండు సాక్షి లు కొనాలి అదో వృధా

  5. వాలంటీర్లు ఉండడం వల్ల పార్టీ నాయకులకు ప్రజలకు మధ్య రేలషన్ లేకుండా , కింది స్థాయి నాయకులు విలువ లేకుండా పోయంది, జగన్ ఓడిపోవడానికి ఏది కూడా ఒక కారణం . అది తెలిసి మళ్ళీ వాలంటీర్లు లని ఎలా కొనసాగిస్తారు .

    కానీ వాళ్ళు గత ప్రభుత్వం లో సరైన నియమించ బడలేదు (వీళ్లని నిజంగా జి.ఓ. ద్వారా ప్రభుత్వ ఎంప్లాయ్ గా చేసి ఉంటే వీళ్ళని ఉద్యోగం లోనుంచి తీసివేసే అధికారం బాబు కు ఉండదు ). జగన్ ప్రభుత్వం సరైన జి.ఓ. ఇవ్వలేదు , ఇప్పుడు వీళ్లకు అవకాశం దొరికింది .

    1. So babu గారికి 2 లక్షల మందిని GO ద్వారా రిక్రూట్ చేశారా లేక డైరెక్ట్ గా చేశారా అనే విషయం తెలియదు అంటారు మీరు

  6. NDA ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడా అయిపు లేరు! ఏ రకమైన డ్యూటీ వెయ్యడం లేదో ఏమిటో? కేవలం అదేదో పన్ను ప్రాపర్టీ టాక్స్ కట్టించుకోవడానికి మాత్రమే నేమో?

  7. పనికిమాలిన వ్యవస్థ… సచివాలయాలు కూడా తీసేయాలి ప్రేమలయాలు చేసి అందర్నీ పాడు చేశారు పని పాట లేదు యూట్యూబ్ చూస్తూ సీరియల్స్ చూడటమెగా

  8. Anni rakaluga atu prajalu. Etu prabhutvam. Volunteers ni 5 years vadukoni. Eppudu evari notiki vachinattu vallu matladthunnaru. Mi family’s lo nijama ga kasttapadda Volunteer unte. Appudu miku telisundedhi. Memu padda kastam emito. anyayam jaragani vadu edhyina matladtharu. Kani nasttapoyina vadi ke thelusthundhi Aa badha. Mosam ekkuva kalam nilavadhu. Entha mandhi life tho adukuntunnaru. Thappaka palitham anubhavistharu. Unnodi dhaggara lakkondi. Emi leni malanti valla life tho endhuku adukuntunnaru.

  9. Gatha prabhuthvam lo volunteer ki oka value undedhi. Eppudu purthi avasaram lekunda chesesaru. Okka sari karona time gurthu thechukondi andharu. Mi kalla dhaggara ki anni techi eche vallam. Evaro okkaro,edharo pani cheyakapothe. Motham andharini kalipi anakandi. Eppudu volunteer kosam matlade vallu. Nijama ga vallu kasttapadi pani chesi mosapothe appudu thelusthundi ma badha.

  10. జగన్ ఓడిపోకముందే ఆ వ్యవస్థని పట్టించుకోలేదు.. కాంట్రాక్టు అయిపోయిన విషయం పక్కన పెట్టి ఎలెక్షన్స్ లో ఊడిగం చేయించాడు అది చెప్పు. జగన్ వాలంటీర్లను మోసం చేసి ఎలాంటి చట్టాలు లేకుండా పెట్టుకున్నాడు. చట్టం అనేది ఉంటేనే…వాళ్ళని ఏంచేయాలో ఆలోచించవచ్చు. వాళ్లగురించే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని ఆలోచించవచ్చు .అసలు Go లేకుండా 5సంవత్సరాలు వాలంటీర్ వ్యవస్థ ను అసలు ఎలా నడిపారు రా అయ్యా .

      1. G.o. ఇవ్వని విషయయం ఇప్పుడేగా బయటపడింది. సో go లేకుండా 10 రూపాయలు కూడా పెంచలేరు

          1. Mana single simham bayapadi 2020 G.O. lu daachaadu…anni rahasya G.O. le. papam aa matram knowledge ledanukunta. Monna september lone old G.O. lu public ayindi

        1. GO ivvaleraa ithe ippudu. Monne kadaa electricity charges penchaneeki two GOs ichaaru. Charges penchaniki GOs isthaaru. Salaries penchaniki, jobs vunchaniki matram GOs ivvadu. Arthaam ayyindi le raja

      2. వాళ్ళు మాట ఇస్తే… వీళ్ళు నమ్మడమేనా? ఇలా ఐతే ఇలా? రాజకీయ నాయకుడు లక్ష చెప్తాడు.. వాడికి అనుకూలం అయిందే చేస్తాడు… ఉపయోగం అనుకుంటేనే చేస్తాడు

    1. I don’t think anybody forced them to take the job of volunteer for Rs. 5,000. They voluntarily accepted the job knowing it is not a permanent job. Now, they believed the assurance that they will be paid Rs. 10,000 by the new government. If that assurance is not implemented quickly they have the right to agitate.

      1. You are right. But volunteers not needed, because Jagu followed the lazy IAS officer Kallam Ajay Reddy who just wanted to appease innocent Jagu without experience who wanted some thing new without studying the system thoroughly

  11. ప్రజలకోసం ఉద్యోగులు ఉద్యోగులకోసం ప్రజలు కాదు అవసరం ఉంటే పెట్టుకొంటారు అవసరం లేదనుకొంటే తీసేస్తారు ప్రజలు కట్టిన పన్నును ఇష్టారాజ్యమ్ గ ఖర్చుపెడితే అది జగన్ పాలన అవుతుంది

Comments are closed.