ఈనెల 14 వతేదీన జవాహర్ లాల్ నెహ్రూ జయంతి వస్తుంది. వచ్చేనెల 9వ తేదీన సోనియాగాంధీ పుట్టినరోజు. ఈ రెండు రోజుల సందర్భంగా ఏదైనా ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం.. రాష్ట్రంలో మనుగడ సాగించాలనుకునే కాంగ్రెస్ నాయకులకు అత్యంత అవసరం.
రేవంత్ రెడ్డి అందుకు అతీతుడైన నాయకుడు ఎంతమాత్రమూ కాదు! అధిష్ఠానం పెద్దలను నిత్యమూ ప్రసన్నం చేసుకునే అవసరం ఆయనకే ఎక్కువ. ఈ రెండు దినోత్సవాల సందర్భంగా భారీ వేడుకలను ఎవరైనా ప్లాన్ చేస్తారు. కానీ ఇప్పుడున్న రేవంత్ సర్కారుకు కాస్త క్రియేటివిటీ ఎక్కువ కాబట్టి.. నవంబరు 14 నుంచి డిసెంబరు 9 వరకు ఏకబిగిన ఉత్సవాలు నిరంతరాయంగా నిర్వహించడానికి ప్లాన్ చేసింది. వీటికి ప్రజా విజయోత్సవాలు అని పేరు పెట్టారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిండా ఏడాది కూడా పూర్తి కాలేదు. కాస్త దూకుడుగా పరిపాలన చేసుకుంటూ వెళుతున్నారు తప్ప.. వారు తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకు సర్వజనామోదం ఉన్నదని చెప్పడానికి అవకాశం లేదు. వారు ప్రకటించిన ఎన్నికల హామీలు చాలా పెండింగులోనే ఉన్నాయి. ఒక పార్టీ ప్రకటించిన అన్ని ఎన్నికల హామీలను తొలి ఏడాదిలోనే పూర్తిచేసేయాలని మనం కూడా అనలేం. కానీ.. చేసేస్తున్నాం.. చేసేశాం.. అని ప్రభుత్వం ప్రకటించుకున్న అనేక హామీలు కూడా ఇంకా పెండింగులోనే ఉండడం ఆలోచించాల్సిన సంగతి. రుణమాఫీ వంటి కీలక విషయాల్లో కూడా ఇంకా కొంత పెండింగు ఉండడాన్ని గమనించాలి.
ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సర్కారు ప్రజా విజయోత్సవాలు అంటూ జరుపుకోవడం అతిశయోక్తి కాక మరేమిటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు భారత రాష్ట్ర సమితి.. ఈ సర్కారు మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిపోయిందని, ఇప్పుడు ఎన్నికలు జరిగినా సరే.. భారాసనే విజయం సాధిస్తుందని రకరకాలుగా అంటున్నది.
చాలా రోజులుగా అజ్ఞాతంలో ఉన్నట్టుగా ఇంటికే పరిమితమై పోయిన కేసీఆర్ తాజాగా నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే నెల నుంచి ఆయన ప్రజాక్షేత్రంలో పర్యటనలు ముమ్మరంగా సాగిస్తారని పార్టీ చెబుతున్నది. ఆయన మనం రాబోయే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తున్నాం.. ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోయింది అంటున్నారు.
మరీ అంత లేకపోయినా.. రేవంత్ ప్రభుత్వానికి డిస్టింక్షన్ మార్కులైతే లేవు. చాలా ప్రభుత్వ నిర్ణయాలు వివాదాలుగానే మగ్గుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వారు ప్రజా విజయోత్సవాలు పేరిట ఉత్సవాలు చేసుకోవడం పరువు కాపాడుతుందా? అనే చర్చ నడుస్తోంది.
చంద్రబాబు గారు చేసే అతి కే జనాలు 23 ఇస్తే, వీళ్ళ అతి కి ప్రజలు డిపాజిట్ లు కూడా దక్కే పరిస్థితి లేకుండా చేస్తారు!
is that your line of attach from sajjala?..Rs 5
“Andhra” vaadu atu itu kaani bjp gujju’s slave
తాము ఎలా ఉంటే ఎదుటి వాళ్ళను అలా అనుకోవడం కొంతమంది లక్షణం!
11 ఇచ్చారు అంటే తీసుకున్న వాళ్ళు ఎంత అతి చేసారో నువ్వు చెప్పిన డిపాజిట్స్ చాలా చోట్లే పోయాయి మొన్న వైసీపీ కి 😅😅
వాళ్ళు చేసింది అతి కాదు, అస్సలు డెవలప్మెంట్ లేకపోవడం, సంక్షేమ పథకాలు మాత్రమే డెవలప్మెంట్ అని బుకాయించడం!
డేశ్ కి నేత అని డప్పేసుకున్న వాళ్ళ్ళకు ఇచ్చిన దాని గురించి ఏమంటారు
vc estanu 9380537747