సూర్యలా వరుణ్ ఎందుకు చేయట్లేదు

ఈసారి వరుణ్ తేజ్ గట్టిగా దిగాడు. మట్కాపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. అతడు ప్రచారం చేస్తున్న తీరు చూస్తుంటేనే, సినిమాపై అతడు ఏ రేంజ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడో అర్థమౌతోంది. కేవలం హైదరాబాద్ కే…

ఈసారి వరుణ్ తేజ్ గట్టిగా దిగాడు. మట్కాపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. అతడు ప్రచారం చేస్తున్న తీరు చూస్తుంటేనే, సినిమాపై అతడు ఏ రేంజ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడో అర్థమౌతోంది. కేవలం హైదరాబాద్ కే పరిమితం కాకుండా.. ప్రధాన నగరాలు చుట్టేస్తున్నాడు. ఓసారి ముంబయి వెళ్లొచ్చాడు, వైజాగ్ లో ఫంక్షన్ పెట్టాడు.

అయితే డబ్బింగ్ సినిమా అయినప్పటికీ సూర్య కూడా ఏమాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్ లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నాడు ఈ హీరో. ఇప్పటికే ఓసారి హైదరాబాద్ వచ్చిన సూర్య, తాజాగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కోసం మరోసారి వచ్చాడు.

బాక్సాఫీస్ బరిలో మట్కా-కంగువా మధ్య పోటీ ఎలా ఉంటుందో అప్పుడే చెప్పలేం కానీ ప్రచారంలో మాత్రం ఈ రెండు సినిమాలు అరివీర భయంకరంగా పోటీపడుతున్నాయి. ప్రస్తుతానికైతే ప్రమోషన్ విషయంలో సూర్యదే పైచేయిగా కనిపిస్తోంది.

సూర్య చాన్నాళ్లుగా కంగువా సినిమాకు ప్రచారం చేస్తున్నాడు. రీసెంట్ గా జరిగిన ఫంక్షన్ కు రాజమౌళి, దిల్ రాజు, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి వాళ్లను తీసుకొచ్చి జనాల దృష్టిని ఆకర్షించాడు. పనిలోపనిగా బాలయ్యతో చిట్ చాట్ కూడా చేశాడు.

మట్కా విషయంలో మాత్రం ఇంత హంగామా కనిపించడం లేదు. ప్రచారం జోరుగా చేస్తున్నప్పటికీ ఎటుచూసినా వరుణ్ తేజ్ మాత్రమే కనిపిస్తున్నాడు. అనుకుంటే వరుణ్ తేజ్ కూడా తన కాంపౌండ్ హీరోల్ని రంగంలోకి దించొచ్చు. కానీ ఎందుకో అతడు ఆ పని చేయడం లేదు.

రీసెంట్ గా జరిగిన పరిణామాల కారణంగా అల్లు అర్జున్ ను ఎలాగూ ఆహ్వానించలేడు. పోనీ పవన్ ను పిలుద్దామంటే ఆయన సినిమా కార్యక్రమాలకు దూరం. రామ్ చరణ్, గేమ్ ఛేంజర్ ప్రమోషన్ లో బిజీ అయిపోయాడు. ఇక మిగిలించి చిరంజీవి మాత్రమే. మరి వరుణ్ తేజ్ ఏమనుకుంటున్నాడో..

నిజానికి వరుణ్ తేజ్ కు ‘మట్కా’ సక్సెస్ చాలా అవసరం. అతడి మార్కెట్ ను డిసైడ్ చేసే సినిమా ఇది.

2 Replies to “సూర్యలా వరుణ్ ఎందుకు చేయట్లేదు”

Comments are closed.