మొన్నటివరకు పుకారు, ఆ తర్వాత అదే నిజమైంది. పుష్ప-2 సినిమా విషయంలో దేవిశ్రీ ప్రమేయాన్ని పరిమితం చేశారు. ఎవరు చేశారనేది సస్పెన్స్, సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ పాత్ర తగ్గిపోయిందనేది పచ్చి నిజం. అతడితో పాటు మరికొందరు మ్యూజిక్ డైరక్టర్లు వచ్చి చేరారు. దేవిశ్రీకి గట్టి పోటీదారు తమన్ కూడా ఇందులో ఉన్నాడు.
మరి ఇలాంటి టైమ్ లో దేవిశ్రీ మీడియా ముందుకొస్తాడా? పుష్ప-2కు ప్రచారం చేస్తాడా? సినిమాలో మ్యూజిక్ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోగలడా?
సినిమా చిన్నదైనా, పెద్దదైనా ప్రచారంలో భాగంగా సంగీత దర్శకుడు మీడియా ముందుకొచ్చి ఇంటర్వ్యూలివ్వడం ఆనవాయితీ. ఇంకా చెప్పాలంటే హీరోహీరోయిన్లు, దర్శకుడి కంటే ముందు సంగీత దర్శకుడి ఇంటర్వ్యూనే బయటకు వదుల్తారు.
పుష్ప-2 ప్రచారం మొదలైంది, ట్రయిలర్ ఆర్భాటంగా రిలీజైంది. గ్రౌండ్ ఈవెంట్స్ డీటెయిల్స్ కూడా బయటకొచ్చాయి. సమాంతరంగా యూనిట్ లో కీలక సభ్యుల ఇంటర్వ్యూలు కూడా రావాలి. మరి దేవిశ్రీ బయటకొస్తాడా?
ఇప్పటికే ఈ సినిమాలో తన పాత్ర ఏంటి, ఎంత అనే విషయంపై సంగీత దర్శకుడు తమన్ క్లారిటీ ఇచ్చేశాడు. అతడు ఈ సినిమాను ఎంత క్యాష్ చేసుకోవాలో అంతా చేసుకుంటున్నాడు. మరి సినిమాలో పాటలన్నీ కంపోజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ బయటకు రాకపోతే ఎలా.. అతడు తప్పకుండా బయటకు రావాలి.. తన వెర్షన్ వినిపించాలి.
ఇప్పటికే దేవిశ్రీకి బురద అంటుకుంది. అతడిపై తీవ్ర విమర్శలున్నాయి. సినిమా ప్రచారం మాట అటుంచి, కనీసం తనపై పడిన మరకల్ని చెరిపేసుకునేందుకైనా దేవిశ్రీ బయటకు రావాలి.
vc estanu 9380537747