పుష్ప 2.. ఆశలు.. అత్యాశలు

హాలీవుడ్ లో, ఇతర భాషల్లో క్రిస్మస్ కు చాలా సినిమాలు వస్తున్నాయి. అందువల్ల పుష్ప తొలి రెండు వారాల్లో మాగ్జిమమ్ వసూళ్లు సాధించాలి.

పుష్ప 2 సినిమాకు విపరీతమైన బజ్ వుంది. జనాలు చూడాలనే ఆసక్తితో వున్నారు, అంత వరకు నిజం. ఎంత వసూలు చేస్తుంది అన్నది అంచనా మాత్రమే. ఆ అంచనా నిజం కావచ్చు. కాకపోవచ్చు. కానీ ఈ అంచనాల మేరకు నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ జనాలు వరల్డ్ వైడ్ గా 600 కోట్ల మేరకు థియేటర్ హక్కులు మార్కెట్ చేసారు. అయితే ఇందులో చాలా వరకు ఓన్ రిలీజ్ నే. ఆంధ్ర, సీడెడ్ ల్లో మాత్రం పక్కాగా విక్రయించారు. జనాలు ఎంత రేట్ అంటే అంతా ఇచ్చారు. కారణం మైత్రీ మూవీస్ మీద వున్న నమ్మకం. ఇచ్చిన డబ్బుల మేరకు వసూళ్లు లేకపోతే, వాళ్లే వెనుక్కు ఇస్తారనే నమ్మకం. పుష్ప పార్ట్ వన్ కు జరిగింది అదే. వసూళ్లు తగ్గిన చోటల్లా డబ్బులు వెనక్కు ఇచ్చారు.

ఇప్పుడు అదే ధీమా, అదే నమ్మకం, దానికి తోడు సినిమాకు వున్న బజ్ మేరకు బయ్యర్లు డబ్బులు ఇవ్వడానికి సిద్దం అవుతున్నారు. అదే టైమ్ లో బజ్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఫిక్స్ డ్ హైర్, మినిమమ్ గ్యారంటీలు భారీ అంటే భారీగా చెబుతున్నారు. దాదాపుగా ఆర్ఆర్ఆర్ ఏ మేరకు టోటల్ రన్ లో వసూలు చేసిందో అంత కోట్ చేస్తున్నారు. దాంతో కొనడానికి ముందుకు వచ్చిన వాళ్లు భయపడుతున్నారు. ఇంకా చాలా టైమ్ వుంది. కనుక రేట్లు ఎక్కడ ఫిక్స్ అవుతాయో చూడాలి.

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నుంచి రేట్లు ఎలాగూ వస్తాయి. మైత్రీ మూవీ మేకర్స్ అటు ఏపీ ప్రభుత్వ పెద్దలతో, ఇటు తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత బంధాలు కలిగి వున్నారు కనుక అదనపు రేట్ల బాధ లేదు. ఎటొచ్చీ ఆ రేట్లు పెట్టి చూడాల్సింది ఫ్యాన్స్ నే. ఫ్యామిలీలు, న్యూట్రల్ ప్రేక్షకులు తొలి వారం అంతంత భారీ రేట్లు పెట్టి సినిమా చూడరు. వాళ్లు రేట్లు తగ్గే వరకు వెయిట్ చేస్తారు. కానీ ఒకటి రెండు వారాలకు అదనపు రేట్లు తీసుకుంటారా? లేక మళ్లీ సంక్రాంతి సీజన్ కు వేరే రేట్లు అడుగుతారా? చూడాలి.

ఇక్కడి మార్కెట్ ఇలా వుంటే ఓవర్ సీస్ మార్కెట్ దాదాపు 50 మిలియన్లు వసూలు చేయాలనే లక్ష్యంతో వున్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకున్న సినిమా లేదు. కానీ పుష్ప 2 ప్రయత్నం అయితే అదే. వరల్డ్ వైడ్ గా 600 కోట్లకు థియేటర్ హక్కులు మార్కెట్ చేసారు కనుక, ఓన్ రిలీజ్ అయినా, అమ్మకం అయినా, బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే కనీసం 1000 కోట్లు వసూలు చేయాలి. ఆ ఫిగర్ కు చేరుకోవడానికి అవకాశం ఏ మేరకు ఉందన్నది చూడాలి.

హాలీవుడ్ లో, ఇతర భాషల్లో క్రిస్మస్ కు చాలా సినిమాలు వస్తున్నాయి. అందువల్ల పుష్ప తొలి రెండు వారాల్లో మాగ్జిమమ్ వసూళ్లు సాధించాలి. సంక్రాంతి సీజన్ వుంది. కానీ అప్పటికి దాదాపు నెల పదిహేను రోజులు అవుతుంది. అప్పటి వరకు థియేటర్లు హోల్డ్ చేయడం అంటే కనీసం మూడు వారాలు ఫుల్ రన్ వస్తేనే సాధ్యపడుతుంది. లేదంటే గేమ్ ఛేంజర్, ఢాకూ మహరాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు థియేటర్లు వెళ్లిపోతాయి.

అందువల్ల పుష్ప 2 వెయ్యి కోట్ల వసూళ్ల టార్గెట్ డిసెంబర్ 20 లోపు మాగ్జిమమ్ జరిగిపోవాలి. అలా అని ఆశకు పోయి భారీ రేట్లు పెట్టినా కష్టమే. పుష్ప 2 మేకర్ల మార్కెటింగ్ చాకచక్యం అంతా ఇక్కడే చూపించాల్సి వుంటుంది.

38 Replies to “పుష్ప 2.. ఆశలు.. అత్యాశలు”

  1. Part1 carona time lo vachi e cinemaalu gathi leka north lo hit chesaru. Part2 ku aa chance thakkuva anukunta. Eppudu north Indians mindxet maaripoyindi. Raamudu krishnudu vunte hit chestharu ledante kastame. Applicable for Game changer as well

    1. అంతే 5 మిలియన్ లు అని రాయబోయి సున్నా పడిపోయింది…అన్నాయ్ కి మైండ్ దొబ్బ లేదు

  2. వెయ్యి కొట్లు కాదు కాని 600-800 కోట్లు రావచ్చు, ఎందుకంటే పెద్దగా బాగోని సలార్, కల్కి, దేవర కి 500 కోట్లు వచ్చాయి కదా! వాటి తో పోలిస్తే ఇది మంచి మాస్ సినిమా కావచ్చు. నాకు మాత్రం ఫ్లాప్ అయితే బాగుణ్ణు అనిపిస్తుంది!

    1. అలా కోరుకుంటున్నావు కాబట్టే మొన్ననే ఒక ఫ్లాప్ పడింది😂😂

      1. ఎదుటి సినిమాల మీద వీళ్ళు ప్లే చేసే ట్రిక్స్, మాయోపాయాలు నాకు నచ్చవు, గుంటూరు కారం డివైడెడ్ టాక్ వచ్చిన తర్వాత ఈ సినిమా హీరో “అల” సినిమా విజయం గుర్తుకు వస్తుంది అని పోస్ట్ పెట్టాడు, అలాంటివి తెర వెనుక చాలా చేస్తారు వీళ్ళు.

      2. ఈ సినిమా డైరెక్టర్, త్రివిక్రమ్ మెగా హీరో లకి మాత్రమే డబ్బు తీసుకున్నట్లు అంకితం అయి పని చేస్తారు. జూ ఎన్టీఆర్, మహేష్ కి మనసు పెట్టకుండా పని చేస్తారు.

        1. ఇక నుంచీ AA హిట్ అయినా ఫ్లాప్ అయినా మెగా క్యాంపు ఎంత మాత్రం కాదు! అయినా సినిమా ఫ్లాప్ అయితే పోయే డబ్బులు త్రివిక్రమ్ వి కాదు, aa వి కాదు సార్. ఇక మహేష్ అండ్ జూనియర్ కి బుద్ధి ఉంటే మరొకసారి కాపీ త్రివిక్రమ్ కి ఛాన్స్ ఇవ్వకూడదు

  3. మా అన్నయ్య కి ఒక్కటే ఆశ కుటుంబం మొత్తం తక్కువ ఖర్చుతో సినిమా చూడాలనే ఉద్దేశం తో సినిమా టికెట్ ధరలు తగ్గించాడు..10,20 కే టిక్కెట్లు అమ్మాలి ..

    1. Ledu.. vallu vollu ammukuni tese err I p o o ku cinema ni nuv 1000 rs pe tt I chudu.. urke ochina sommu tho aithe chustaru.. kastapaduna sommu tho evaru chudaru.. b r o k er kodu kulali em telstadi honesty viluva

  4. 600 kotla ,own release cheskondi 100cr home lo chuskomanu chepandi me Shilpa Arjun ki ,ma nunchi support already poyindi cheyam ,maniplate cheyadaniki guts istem love da istem ani tv lo chesthunadu

Comments are closed.