మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. పెద్ద రాష్ట్రంలో విజయం సాధించారు గనుక కమలానాధులు పెద్ద స్థాయిలో పండుగ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే జార్ఖండ్ రాష్ట్రంలో జేఎంఎం తో కలిసి ఇండియా కూటమి సాధించిన విజయం కంటే వారికి వయనాడ్లో ప్రియాంక గాంధీ సాధించిన విజయమే వారికి గొప్పదిగా కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రాల ఫలితాల గురించి దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు, ప్రభుత్వాల అధినేతలు, తమ తమ స్పందనలను తెలియజేస్తున్నారు. తెలంగాణ విషయానికి వస్తే కీలక పార్టీల నాయకులందరూ కూడా స్పందిస్తున్నారు. అయితే వారు ఈ రెండు రాష్ట్రాల ఫలితాలను కూడా తమకు కావలసిన కోణంలో చూడడానికి మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
మహారాష్ట్ర, జార్ఖండ్ రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో చాలా కీలకంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన సుడిగాలి పర్యటనలు చేశారు. రోడ్డు షోలు నిర్వహించారు. బహిరంగ సభలలో పాల్గొన్నారు. అదే సమయంలో తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడిగా, స్టార్ క్యాంపైనర్ గా కూడా పనిచేశారు. జార్ఖండ్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహించారు.
ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక చేదు- ఒక తీపి ఫలితం లభించాయి. అయితే తెలంగాణలోని ఇతర పార్టీల నాయకులు మాత్రం ఒక భాగాన్నే గమనిస్తున్నారు. మహారాష్ట్రలో ఇండియా కూటమి ఓడిపోయిన తీరును ప్రస్తావిస్తూ ‘రేవంత్ మాటలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదు’ అని ప్రచారం చేయడానికి భారాస, భాజపా నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుండడం విశేషం.
బిజెపికి చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గానీ, భారత రాష్ట్ర సమితి నాయకులు కేటీఆర్, హరీష్ రావు గాని ఈ ఫలితాలపై స్పందించి చెబుతున్న మాట ఒక్కటే! ‘‘రేవంత్ రెడ్డి విఫలమయ్యారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను, చెప్పిన మాటలను మహారాష్ట్ర ప్రజలు విశ్వసించలేదు’ అని మాత్రమే అంటున్నారు. తద్వారా రేవంత్ అసమర్ధుడు అని ప్రొజెక్టు చేయడానికి వారు తపన పడుతున్నారు.
అదే సమయంలో జార్ఖండ్లో దక్కిన విజయాన్ని మల్లు భట్టి విక్రమార్క కు ఆపాదించడానికి వారికి మనసు రావడం లేదు. జార్ఖండ్ లో జైఎంఎం ఇండియా కూటమి గెలిచింది అంటే కేవలం భట్టి విక్రమార్క అక్కడ స్టార్ క్యాంపెనర్ గా ప్రచారం చేయడం వల్ల మాత్రమే గెలిచిందా అనే ప్రశ్న వేస్తే వారి దగ్గర బహుశా సమాధానం ఉండకపోవచ్చు. మహారాష్ట్రలో ఓటమి మాత్రం రేవంత్ కారణంగా జరిగిందని చెబుతున్న వాళ్ళు- జార్ఖండ్ విజయాన్ని కూడా కనీసం భట్టి విక్రమార్క ఖాతాలో వేయాలి కదా అనేది ప్రజల వాదనగా ఉంది.
రేవంత్ రెడ్డి మీద ఏదో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో అసంతృప్తి పుట్టించడానికి ఈ నాయకులందరూ తపన పడుతున్నారా అనే అనుమానం కలుగుతుంది. రేవంత్ రెడ్డి సీఎం గా కలకాలం ఉండి పరిపాలన సాగిస్తే తమకు గడ్డు రోజులు వస్తాయేమో అనే భయంతో ఆయన పట్ల పార్టీలోనే భిన్నాభిప్రాయాలు సృష్టించడానికి వారు ఈ రకమైన మాటలు చెబుతున్నారేమో అనిపిస్తోంది. మొత్తానికి తాము చెప్పదలుచుకున్నది మాత్రమే చెబుతామని, వాస్తవాలు పూర్తి వివరాలతో తమకు ఎప్పటికీ అవసరం లేదని ఆ ముగ్గురు.. అనగా కిషన్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్ నిరూపిస్తున్నారు
Call boy jobs available 7997531004
మీరు కూడా మీ కోణం అంటే మెషిన్ ల ద్వారా ఏదో చేసినట్లు రాస్తున్నారు, రాష్ట్రం అంతా తిరిగి 21, 22 తేదీ లలో మాత్రమే అక్కడ కాపలా ఉన్న అందరినీ మేనేజ్ చేసి మెషిన్ లలో ఏదో చేసినట్లు!
vc available 9380537747
Anshul Saxena post from Facebook!
Pawan Kalyan’s impact on the Maharashtra Assembly election was undeniable, especially in regions where the NDA needed a strong push.
Wherever Pawan Kalyan campaigned, the BJP secured victories across multiple constituencies.
He also shook the foundations of Congress’s stronghold in Latur. Congress was defeated in Latur Rural, and Latur City was only narrowly retained by Congress with a margin of around 7,000 votes.
The significant role of Pawan Kalyan’s outreach in this election cannot be overlooked.
My reaction! Success (Maharashtra) has many fathers like Pawan Kalyan, RSS, Gadakari, Shinde etc. But failure (Jarkhand) has none.