జేసీని ఆది అడ్డుకోగ‌ల‌రా.. ఈ రోజు ఏమ‌వుతోంది?

వైఎస్సార్ జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలోని రాయ‌ల‌సీమ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ (ఆర్టీపీపీ) నుంచి ప్లైయాష్ త‌ర‌లించే విష‌య‌మై జ‌మ్మ‌ల‌మడుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి, తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి మ‌ధ్య తీవ్ర…

వైఎస్సార్ జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలోని రాయ‌ల‌సీమ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ (ఆర్టీపీపీ) నుంచి ప్లైయాష్ త‌ర‌లించే విష‌య‌మై జ‌మ్మ‌ల‌మడుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి, తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి మ‌ధ్య తీవ్ర వివాదం నెల‌కుంది. జేసీ ట్యాంక‌ర్ల‌ను ప్లైయాష్‌ను త‌ర‌లించ‌డానికి ఆది వ‌ర్గీయులు అనుమ‌తించ‌లేదు. ఈ నేప‌థ్యంలో తాడిప‌త్రి మీదుగా ఆది వర్గీయుల వాహ‌నాల‌ను జేసీ అనుమ‌తించ‌లేదు. అయితే పోలీస్ ఉన్న‌తాధికారుల విజ్ఞప్తి మేర‌కు జేసీ ఒక మెట్టు దిగి, అనుమ‌తించారు.

అయితే క‌డ‌ప ఎస్పీకి జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి రాసిన లేఖ సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. ఇవాళ త‌మ వాహ‌నాలు ఆర్టీపీపీకి వెళ్తాయ‌ని, అడ్డుకుంటే చూస్తూ ఊరుకోడానికి సిద్ధంగా లేమ‌ని ఏకంగా క‌డ‌ప ఎస్పీకి తేల్చి చెప్పారు. ఇటీవ‌ల అదానీ సంస్థ‌పై ఆది వ‌ర్గీయులు దాడి చేశార‌ని, వాళ్లలా తాము చేతులు ముడుచుకుని కూచొనే ర‌కం కాద‌ని ఎస్పీకి రాసిన లేఖ‌లో జేసీ స్ప‌ష్టం చేశారు.

దీంతో బుధ‌వారం ఏమ‌వుతుందో అనే ఉత్కంఠ రేకెత్తిస్తోంది. త‌మ వాహ‌నాల‌ను ఆదినారాయ‌ణ‌రెడ్డి అన్న కుమారుడు భూపేష్‌రెడ్డి అడ్డుకుంటున్న‌ట్టు ఎస్పీకి రాసిన లేఖ‌లో జేసీ రాశారు. గ‌త ఎన్నిక‌ల్లో క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్థిగా భూపేష్ బ‌రిలో నిలిచిన సంగ‌తి తెలిసిందే. అవినాష్‌రెడ్డి చేతిలో ఓడిపోయారాయ‌న‌.

ఆదినారాయ‌ణ‌రెడ్డి, భూపేష్‌రెడ్డి త‌గ్గే ర‌కం కాదు. జేసీ బెదిరింపు ధోర‌ణిలో లేఖ రాయ‌డంతో ఆదినారాయ‌ణ‌రెడ్డి మ‌రింత ప‌ట్టుద‌ల‌తో వెళ్లే అవ‌కాశం వుంద‌ని అంటున్నారు. అందుకే ఈ రోజు జేసీ వాహ‌నాలు ఆర్టీపీపీకి వ‌స్తాయా? ప్లైయాష్‌ను త‌ర‌లిస్తాయా? అనే టెన్ష‌న్ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఏది ఏమైనా ప్లైయాష్ త‌ర‌లింపుపై కూట‌మి నేత‌ల మ‌ధ్యే వార్ న‌డుస్తుండ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా చెప్పొచ్చు.

9 Replies to “జేసీని ఆది అడ్డుకోగ‌ల‌రా.. ఈ రోజు ఏమ‌వుతోంది?”

  1. కూటమిలో నాయకులూ చాల understanding గ ఉన్నారంట, ఇదేనేమో మరి ఆ అద్బుతమైన understanding

Comments are closed.