ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు.. చరణ్ మిగిలాడు

రామ్ చరణ్ కూడా రాజమౌళితో మగధీర చేసిన తర్వాత ఆరెంజ్ తో ఫ్లాప్ తిన్నాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తర్వాత గేమ్ ఛేంజర్ రిలీజ్ చేస్తున్నాడు.

రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకైనా ఆ తర్వాత ఫ్లాపులు పలకరించాల్సిందే. రాజమౌళిపై ఉన్న అతిపెద్ద రిమాక్క్ ఇది. ఈ విషయంలో అతడు కూడా ఏం చేయలేడు పాపం. అంతా విధి అనుకోవాల్సిందే.

దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ నెగెటివ్ సెంటిమెంట్ ను ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా చేసిన తారక్, ఆ తర్వాత దేవర సినిమా చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు అందరి చూపు రామ్ చరణ్ పై పడింది.

రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ లో నటించాడు. ఇతడు కూడా రాజమౌళి నెగెటివ్ సెంటిమెంట్ బాధితుడే. మరిప్పుడు ఎన్టీఆర్ తరహాలోనే గేమ్ ఛేంజర్ తో ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా? రాజమౌళిని ఆ నెగెటివ్ సెంటిమెంట్ నుంచి ఒడ్డున పడేస్తాడా?

స్టూడెంట్ నంబర్ 1తో ఎన్టీఆర్ ను డైరక్ట్ చేశాడు రాజమౌళి. ఆ తర్వాత సుబ్బుతో ఎన్టీఆర్ కు ఫ్లాప్. రాజమౌళితో సింహాద్రి సినిమా చేశాడు, ఆ తర్వాత ఆంధ్రావాలా ఫ్లాప్. యమదొంగ చేశాడు, ఆ తర్వాతొచ్చిన కంత్రి ఫ్లాప్. ఎట్టకేలకు ఈ సెంటిమెంట్ ను దేవరతో బ్రేక్ చేశాడు ఎన్టీఆర్.

రామ్ చరణ్ కూడా రాజమౌళితో మగధీర చేసిన తర్వాత ఆరెంజ్ తో ఫ్లాప్ తిన్నాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తర్వాత గేమ్ ఛేంజర్ రిలీజ్ చేస్తున్నాడు. నెగెటివ్ సెంటిమెంట్ ను చరణ్ బ్రేక్ చేయాలని కోరుకుందాం..

13 Replies to “ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు.. చరణ్ మిగిలాడు”

Comments are closed.