ఆరు నెల‌ల్లో కూట‌మి సర్కార్ అప్పు ఎంతంటే?

వైసీపీ లీగ‌ల్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు మ‌నోహ‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు స‌ర్కార్ ఇప్ప‌టి వ‌ర‌కు రూ.73 వేల కోట్లు అప్పు చేసింద‌న్నారు

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విచ్చ‌ల‌విడిగా అప్పులు చేస్తూ, రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష నాయకుడిగా చంద్ర‌బాబు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. తాను సీఎం అయితే సంప‌ద సృష్టించి ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ఫ‌లాలు అందిస్తాన‌ని చంద్ర‌బాబు గొప్ప‌గా ప్ర‌చారం చేశారు. సూప‌ర్ సిక్స్ పేరుతో భారీగా సంక్షేమ ల‌బ్ధి క‌లిగిస్తానంటే జ‌నం న‌మ్మారు. అయితే కూట‌మి స‌ర్కార్ కొలువుదీరి ఏడు నెల‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో, హామీల అమ‌లు చాలా త‌క్కువే.

మ‌రోవైపు రాష్ట్ర అప్పు మాత్రం అంత‌కంత‌కూ పెరుగుతోంది. వైసీపీ లీగ‌ల్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు మ‌నోహ‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు స‌ర్కార్ ఇప్ప‌టి వ‌ర‌కు రూ.73 వేల కోట్లు అప్పు చేసింద‌న్నారు. ఈ డ‌బ్బంతా ఏం చేశారో చెప్పాల‌నేది ఆయ‌న డిమాండ్‌. కాకినాడ పోర్టును గ‌న్ గురిపెట్టి లాక్కున్న‌ట్టు నిస్సిగ్గుగా పోస్టు పెట్టార‌ని ఆయ‌న ఆరోపించారు. టీడీపీ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో జ‌గ‌న్‌పై దుర్మార్గంగా పోస్టులు పెడుతున్న‌ట్టు ఆయ‌న ఆరోపించారు.

కేవ‌లం వ్యంగ్య పోస్టులు పెట్టిన ఇంటూరి ర‌వికిర‌ణ్‌పై 20 కేసులు పెట్టిన‌ట్టు మ‌నోహ‌ర్‌రెడ్డి తెలిపారు. అక్ర‌మ కేసులు పెడుతున్న పోలీసుల‌పై ప్రైవేట్ కేసులు పెడుతున్న‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. అక్ర‌మ కేసుల‌పై మేధావులు, ప్ర‌జా సంఘాల నేత‌లు ప్ర‌శ్నించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

26 Replies to “ఆరు నెల‌ల్లో కూట‌మి సర్కార్ అప్పు ఎంతంటే?”

  1. Roads vesaru, amaravthilo panulu start ayyayi, panchayati lo development kaavalsina panulu start ayyai. Employees ki correct timelo salaries vastunnayi inka chala jarugutunnayi. Annayya antha appu chesi emi chesadu? Oka road veyyaledu, employees ki eppudu time ki salaries ivvaledu , oka development activity ledu. Teda clear ga telustundi ani netizens uvacha

  2. Y Chee Pee wants a govt where the ministers can loot the state and its people wealth, export public rice and earn thousands of crores, demolish existing usable buildings to build palaces for their own sake, fly by Helicopter even for small distances, etc. they didn’t do all this, so they are a complete failure to Y CHEE PEEs

  3. Y Chee Pee wants a govt where the ministers can loot the state and its people wealth, export public rice and earn thousands of crores, demolish existing usable buildings to build palaces for their own sake, fly by Helicopter even for small distances, etc. they didn’t do all this, so they are a complete failure.

  4. Y Chee Pee wants a govt where the ministers can loot the state and its people wealth, export public rice and earn thousands of crores, demolish existing usable buildings to build palaces for their own sake, etc. they didn’t do all this, so they are a complete failure.

  5. Y Chee Pee wants a govt where the ministers can loot state and its people wealth, export rice and earn thousands of crores, demolish existing usable buildings to build palaces for their own sake, etc. they didn’t do all this, so they are a complete failure.

  6. They want a govt where the ministers can loot state and its people wealth, export rice and earn thousands of crores, demolish existing usable buildings to build palaces for their own sake, etc. they didn’t do all this, so they are a complete failure.

Comments are closed.