ఇలా అయితే సినిమాల సంగతేంటి?

చూస్తుంటే, సమంతకు సినిమాలపై ఆసక్తి తగ్గిందేమో అనిపిస్తోంది. దీనికి మరింత ఊతమిస్తూ ఆమె ఓ మీమ్ పోస్ట్ చేసింది.

సమంత ప్రస్తుతం చేస్తున్న సినిమాలేంటి? సడెన్ గా అడిగితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. అంతలా ఆలోచించాల్సి వస్తుంది ఎవరికైనా? అది నిజం కూడా. శాకుంతలం తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చినట్టు సమంత ప్రకటించుకున్నప్పటికీ, ఆమె చేస్తున్నవి మాత్రం చాలా తక్కువ.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ మలయాళం సినిమా చేసేందుకు ఆమె ఒప్పుకుంది. అది చేస్తుందా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. మరోవైపు సొంత బ్యానర్ పై సినిమా ప్రకటించింది. ఆ ప్రకటన వచ్చి చాన్నాళ్లయింది. దాని అప్ డేట్ కూడా లేదు.

కనీసం పుష్ప-2 ఐటెంసాంగ్ లోనైనా ఆమెను చూసుకుందామని కొందరు ఆశపడ్డారు, కానీ అది కూడా జరగలేదు. అలా సినిమాలకు ఆమె పూర్తిగా దూరమైంది.

ఈ గ్యాప్ లో ఓటీటీలో మాత్రం ఆమె బిజీ అవుతోంది. మొన్నటికిమొన్న సిటాడెల్-హనీబన్నీ ని స్ట్రీమింగ్ కు తీసుకొచ్చిన సమంత.. దానికి ఎడతెగని ప్రచారం చేసింది. ఓ సినిమాకు కూడా ఆమె ఎప్పుడూ ఆ స్థాయిలో ప్రచారం చేయలేదు.

మొత్తానికి సిటాడెల్ వేడి చల్లారింది. దీంతో ఆమె తన కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తుందని, మూవీ సెట్స్ పైకి వస్తుందని అంతా ఎదురుచూశారు. కానీ మరో ఓటీటీ వెంచర్ డేట్స్ ఇచ్చింది సమంత. ఈరోజు నుంచి అది మొదలైంది.

చూస్తుంటే, సమంతకు సినిమాలపై ఆసక్తి తగ్గిందేమో అనిపిస్తోంది. దీనికి మరింత ఊతమిస్తూ ఆమె ఓ మీమ్ పోస్ట్ చేసింది. లవ్ సీన్లు చేయడం కంటే, యాక్షన్ సీక్వెన్సులు చేయడమే తనకు ఇష్టమంటూ వెల్లడించింది.

3 Replies to “ఇలా అయితే సినిమాల సంగతేంటి?”

Comments are closed.