మంత్రి భ‌ర‌త్‌కు విద్యార్థిని త‌ల్లి షాక్‌

విద్యార్థిని త‌ల్లి వేదిక‌పైకి ఎక్కి మంత్రి భ‌ర‌త్ ఎదుటే త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఏపీ మంత్రి టీజీ భ‌ర‌త్‌కు విద్యార్థిని త‌ల్లి షాక్ ఇచ్చింది. ఇవాళ త‌ల్లిదండ్రులు-ఉపాధ్యాయుల స‌మావేశాల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా క‌ర్నూలులో ఓ పాఠ‌శాల‌లో నిర్వ‌హించిన స‌మావేశానికి మంత్రి టీజీ భ‌ర‌త్ వెళ్లారు. విద్యార్థిని త‌ల్లి వేదిక‌పైకి ఎక్కి మంత్రి భ‌ర‌త్ ఎదుటే త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మ‌ధ్యాహ్నం వేళ నాణ్య‌మైన భోజ‌నం అందించ‌డం లేద‌న్నారు. ఫుడ్ పాయిజ‌న్ అవుతోంద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీంతో త‌న కూతురికి వారం రోజులుగా వాంతులు అవుతున్నాయ‌ని వాపోయారు. అలాగే హాస్ట‌ల్స్‌లో, స్కూల్స్‌లో బాత్రూమ్‌లు అధ్వానంగా ఉన్నాయ‌న్నారు. వాష్‌రూమ్స్ ద‌య‌నీయంగా ఉన్నాయ‌ని ఆమె తెలిపారు. దుర్వాస‌న వ‌స్తోంద‌ని, పిల్ల‌ల‌కు తినే తిండి ఎలా ఒంట‌ప‌డుతుంద‌ని మంత్రిని ఆమె నిల‌దీశారు.

ఒక‌సారి మీరే వెళ్లి చూస్తే, మ‌ధ్యాహ్న భోజ‌నం, అలాగే బాత్‌రూమ్‌లో ఏ విధంగా ఉన్నాయో అర్థ‌మ‌వుతుంద‌ని ఆమె అభ్య‌ర్థించారు. మంత్రి ఎదుట విద్యార్థిని త‌ల్లి ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

గ‌తంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం విద్యారంగంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపింది. స్కూళ్ల‌లో సౌక‌ర్యాల క‌ల్ప‌న‌తో పాటు వారికి పౌష్టికాహారం, అలాగే నాణ్య‌మైన భోజ‌నాన్ని పెట్టింది. ఇప్పుడా ప‌రిస్థితి లేద‌న్న విమ‌ర్శ‌ల‌పై కూట‌మి స‌ర్కార్ చ‌ర్య‌లు తీసుకోవాల్సి వుంది.

11 Replies to “మంత్రి భ‌ర‌త్‌కు విద్యార్థిని త‌ల్లి షాక్‌”

    1. బాత్రూంలో వారం రోజులు పట్టించుకోకపోయినా పాడైపోతాయి

      ప్రతిదీ పట్టించుకోవాలి బ్రదర్

Comments are closed.