తెలుగుదేశం పార్టీ వారు తామేదో మహాద్భుతం చేసేస్తున్నట్టుగా.. చేసిన అతి రాంగోపాల్ వర్మకు వరంగా మారిందా అనే అభిప్రాయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఆయన పెట్టిన సోషల్ మీడియా పోస్టుల్లో ఒకే పోస్టుకు సంబంధించి.. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగా కేసులు పెట్టడమే ఇప్పుడు బెయిల్ పొందడంలో ఆయనకు ఎడ్వాంటేజీగా మారిందా అనే వాదన వినిపిస్తోంది.
రాంగోపాల్ వర్మకు హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఆయన మీద ఏపీలో వేర్వేరు చోట్ల కేసులు నమోదు అయిన నేపథ్యంలో ఆయన ఇదివరలోనే ముందస్తు బెయిలుకు పిటిషన్ వేశారు. ఒకసారి రిజెక్టు అయింది. అప్పటికే ఆయనకు ఒంగోలు పోలీసులు నోటీసులు ఇవ్వడమూ, విచారణకు సమయం అడగడమూ జరిగాయి. ఈలోగా మరికొన్ని స్టేషన్లలో కూడా కేసులు నమోదు అయ్యాయి.
తాను పెట్టిన ఒక పోస్టుకు సంబంధించి.. ఆ పోస్టుకు సంబంధం లేని వ్యక్తులు.. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ వేర్వేరు స్టేషన్లలో కేసులు పెట్టడాన్ని కేవలం రాజకీయ ప్రేరేపిత వేధింపుల చర్యగా వర్మ అభివర్ణించారు. తనమీద కొత్తగా కేసులు నమోదు చేయకుండా డీజీపీని ఆదేశించాలని కూడా కోర్టులో ఇంకో పిటిషన్ వేశారు.
అయితే ఒకే వ్యవహారానికి సంబంధించి పెడుతున్న కేసులు బహుశా ఫ్యాబ్రికేటెడ్ గా హైకోర్టుకు కూడా కనిపించి ఉంటాయి. ఒకే విషయంలో తెలుగుదేశం కార్యకర్తలు పనిగట్టుకుని అతి చేస్తున్నారని ఎవ్వరైనా నమ్మడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఉదాహరణకి వర్రా రవీందర్ రెడ్డిని కూడా కేసుల పేర్లు మీద రకరకాల ఊర్లు, జైళ్లు తిప్పుతున్నారు పోలీసులు. కానీ అవన్నీ వేర్వేరు కేసులు. వేర్వేరు పోస్టులకు సంబంధించి వేర్వేరు వ్యక్తులు పెట్టిన కేసులు కావడంతో.. వర్మ తరహాలో వాదించి బెయిలు విషయంలో నెగ్గడానికి అవకాశం లేకుండాపోయింది.
అదే రాంగోపాల్ వర్మ విషయం వేరు. ఒకే పోస్టు విషయంలో పలు కేసులు నమోదుకావడం అనేది ఆయనకు లాభించింది. ఇలాంటి అతి చేయడం తగ్గించకుంటే.. తెలుగుదేశం పార్టీ వారు ముందు ముందు పెట్టే సోషల్ మీడియా పోస్టులకు విలువ ఉండదు. కేసులు ఎదుర్కొనే వారికి బెయిలు పొందడం సులువు అవుతుందని పలువురు భావిస్తున్నారు.
OK
Aythe OK
బయపడ్డాడు
ఎవరు చంద్రబాబు నా
Caste politics