బుచ్చిబాబు-చరణ్.. ఆ ఫీట్ సాధ్యమా!

గేమ్ ఛేంజర్ నార్త్ బెల్ట్ జనాలకు ఏ మేర‌కు పడుతుందో చూడాలి. దాని తరువాత వచ్చే బుచ్చిబాబు సంగతి చూడాలి.

సుకుమార్-బన్నీ – పుష్ప సిరీస్ నార్త్ బెల్ట్ లో సూపర్ డూపర్ హిట్. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఉప్పెన సినిమా కూడా బ్లాక్ బస్టర్. మరి ఇప్పుడు అదే బుచ్చిబాబు తీస్తున్న ‘పెద్ది’ (వర్కింగ్ టైటిల్ అనుకోండి) సినిమా నార్త్ బెల్ట్ కు ఎక్కుతుందా? ఇప్పటి వరకు కొంత మేరకు ఆ సినిమా సబ్జెక్ట్ బయటకు వచ్చింది. వచ్చిన మేరకు చూసుకుంటే బుచ్చిబాబు ఆ సినిమాతో మంచి ఫీట్ సాధించగలరా అన్నది అనుమానం.

ఎందుకంటే క్లాస్ స్టోరీలు లేదా స్పోర్ట్స్ డ్రామాలు నార్త్ బెల్ట్ కు అంతగా పట్టడం లేదు. హీరో కింద నుంచి వచ్చాడు. క్రీడల్లో పైకి వెళ్లాడు.. అక్కడో ట్విస్ట్..ఇలాంటి కథలకు అడుగు అడుగు ఎలివేషన్లు యాడ్ చేయడం కష్టం.

కేజిఎఫ్, సలార్, పుష్ప జానర్లు వేరు. హీరో కనిపించిన ప్రతిసారీ ఎలివేషన్లే. అలాగే నాటు పాటలు. బుచ్చిబాబు-చరణ్ సినిమాలో వాటికి ఏ మాత్రం స్కోప్ ఉంటుందో చూడాలి. కేవలం రెహమాన్ ను తీసుకుంటే సరిపోదు, సల్మాన్ ఖాన్ ను చూపిస్తే సరిపోదు. మెగాస్టార్ చిరు సినిమాలో సల్మాన్ కనిపిస్తే ఏం ఒరిగింది?

నిజంగా పాన్ ఇండియా స్టోరీ అయి ఉంటే ఎన్టీఆర్ ఎందుకు వదలుకుంటారు అన్నదో అనుమానం. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ తన కెరీర్ సెట్ చేసేసుకుంటున్నారు. ప్రభాస్, బన్నీ ఓకె. చరణ్ నే ఇంకా సెట్ చేసుకోలేదు. గేమ్ ఛేంజర్ తరువాత డిసైడ్ అవుతుంది. గేమ్ ఛేంజర్ నార్త్ బెల్ట్ జనాలకు ఏ మేర‌కు పడుతుందో చూడాలి. దాని తరువాత వచ్చే బుచ్చిబాబు సంగతి చూడాలి. ఈ లోగా చరణ్ సరైన దర్శకులతో సరైన లైనప్ సెట్ చేసుకోవాలి మంచి మాస్ సినిమాలు చేయడానికి.

7 Replies to “బుచ్చిబాబు-చరణ్.. ఆ ఫీట్ సాధ్యమా!”

  1. Global wide CHARAN is India’s biggest star….

    Game Changer తో మరింత బలంగా నిరూపితం అవబోతోంది ఇది

Comments are closed.