ఆరోజు మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగిందంటే..?

పాత గొడవలున్నాయి. ఈ గొడవతో అన్నీ పెద్దవయ్యాయి. అన్నదమ్ములకు మనస్పర్థలున్నాయి. మౌనికను మనోజ్ చేసుకోవడం వాళ్లకు ఇష్టం లేదు.

ఆ రోజు రాత్రి ఏం జరిగింది..? తండ్రీకొడుకులు మోహన్ బాబు, మంచు మనోజ్ నిజంగానే గొడవ పడ్డారా? ఆ స్పాట్ లో ఉన్న ప్రత్యక్ష సాక్షి వీడియో ఒకటి బయటకొచ్చింది. ఆమె మంచు మోహన్ బాబు ఇంటి పని మనుషుల్లో ఒకరు. ఆ రోజు ఏం జరిగిందో ఆవిడ మాటల్లోనే…

” సార్ (మోహన్ బాబు) స్టాఫ్ ను కొట్టాడు మనోజ్. నా స్టాఫ్ మీద చేయి చేసుకోవద్దంటూ మోహన్ బాబు, మనోజ్ ను నెట్టారు. అలా నెట్టినా కూడా మనోజ్ ఆగలేదు. దాంతో తండ్రీకొడుకులు ఒకర్నొకరు నెట్టుకున్నారు. స్టాఫ్ కారణంగానే ఈ గొడవ జరిగింది.”

ఇలా కేవలం స్టాఫ్ కారణంగానే తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగిందని వెల్లడించిందామె. అయితే మూలం మాత్రం ఇది కాదని, వాళ్ల మధ్య పాత గొడవలున్నాయని కూడా వెల్లడించింది. తాజా గొడవలో మంచు మనోజ్ కు పెద్దగా దెబ్బలు తగల్లేదని అంటోందామె.

“పాత గొడవలున్నాయి. ఈ గొడవతో అన్నీ పెద్దవయ్యాయి. అన్నదమ్ములకు మనస్పర్థలున్నాయి. మౌనికను మనోజ్ చేసుకోవడం వాళ్లకు ఇష్టం లేదు. ఆల్రెడీ మౌనికకు ఓ బాబు ఉన్నాడు. అది వాళ్లకు నచ్చలేదు. ఈ విషయంపై మొదట్నుంచి డిస్టర్బ్ అవుతున్నారు. సార్ (మోహన్ బాబు) మీద చేయి వేస్తే విష్ణు అన్న ఊరుకోడు. తండ్రి అంటే ప్రాణం. అలాంటి సార్ మీద మనోజ్ అన్న చేయి చేసుకున్నాడు. డాడీని ముట్టుకుంటావా అనే కోపం విష్ణు అన్నకు ఉంది.”

“మంచు మంటలు” ఎపిసోడ్ లో ఇదో కొత్త కోణం. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా ఇప్పుడు వివాదంలో కీలకంగా మారింది.

మరోవైపు చెప్పినట్టుగానే తెలంగాణ డీజీపీని కలిశాడు మంచు మనోజ్. భార్యతో కలిసి డీజీపీ ఆఫీస్ కు వెళ్లిన మనోజ్, జరిగిన వివరాలన్నింటినీ చెప్పి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరాడు.

19 Replies to “ఆరోజు మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగిందంటే..?”

  1. ఆమె మాటలు ….scripted కావొచ్చు..ఎవరో రాసిన స్క్రిప్ట్….అంత ధైర్యం గా ఆమె బయట వాళ్లకు లోపల ఏం జరిగిందీ చెప్పలేదు

  2. హైదరాబాద్ తెలంగాణ సరస్వతపరిషద్ కాలేజీలో నకిలీ దళిత పత్రాలతో పట్టుబడ్డ లెక్చరర్ శ్రీమతి బిరుదురాజు రాజారత్నం కేసులో ఇంట్లో అందరూ చూసారు. తండ్రిపేరుతో తీసుకున్న దళిత పత్రాలు నకిలీ అని నిర్ధారణ అయ్యాక, డిస్మిస్ నుండి తప్పించుకోవడానికి నకిలీ తల్లిని, రకరకాల కణికట్టు కథలను, న్యాయవాది సృష్టించాడు. కోర్టులో వీళ్లకు బ్రేకులుండవ్

  3. ఆర్జీవీ సినిమాకి ఇంకో కథ దొరికింది…

    దానికి ‘భక్త ‘ చర్రిత అని పేరు పెడతాడేమో

  4. దీని ద్వారా తెలిసినది ఏంటంటే అన్ని బంధాలు ఆర్ధిక బంధాలే ఐపోయాయి నేటి కాలం లో

Comments are closed.