చూస్తుంటే, కీర్తి సురేష్ కు పని తప్ప పెళ్లిపై పెద్దగా ధ్యాస లేనట్టుంది. సరిగ్గా 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఆమె ఇంకా వృత్తి జీవితంలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. ఓవైపు పెళ్లి తేదీ దగ్గర పడుతుంటే, ఆమె ఓ మ్యాగజైన్ కు ఫొటోషూట్ చేసింది. ఆ స్టిల్స్ ను తన ఎకౌంట్ లో పోస్ట్ చేసింది. మరోవైపు తన తొలి బాలీవుడ్ సినిమాను ప్రతి రోజూ ప్రమోట్ చేస్తోంది.
మరికొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకొని, అసలు ఆ మూడ్ లోనే లేనట్టు వ్యవహరిస్తోంది కీర్తిసురేష్. ఆమె సోషల్ మీడియా పేజీ చూసిన వాళ్లకు ఎవరికైనా, అసలు కీర్తిసురేష్ పెళ్లి మూడ్ లో ఉందా అనే అనుమానం కలుగుతోంది.
ప్రతి గంటకు ఆమె తన హిందీ సినిమా లేదా ఫొటోషూట్ ప్రమోషన్ మాత్రమే పెడుతోంది. మరో హీరోయిన్ అయితే ఈ పాటికి తన టైమ్ లైన్ ను ప్రీ-వెడ్డింగ్ ఫొటోలు, హల్దీ ఫంక్షన్ ఫొటోలతో నింపేసేది. కానీ కీర్తి సురేష్ మాత్రం తన పెళ్లి విషయాల్ని సోషల్ మీడియాలో పంచుకునేందుకు అస్సలు ఆసక్తి చూపించడం లేదు.
తన కాబోయే భర్తను పరిచయం చేయడం వరకే పరిమితమైన కీర్తి సురేష్, ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క పెళ్లి అప్ డేట్ కూడా ఇవ్వలేదు. ఎల్లుండి (12వ తేదీ) ఆంటోనీ తటిల్ ను వివాహం చేసుకోబోతోంది ఈ హీరోయిన్. హిందూ-క్రిస్టియన్ సంప్రదాయాల్లో గోవాలో ఈ పెళ్లి జరగనుంది. పెళ్లి వేడుకలు మొదలయ్యాయి.
manchipani…
Christian kada. Baaga gattigaane vestaadu keertini
Honey trap