హరిహర వీరమల్లు సినిమా కొలిక్కి వచ్చింది. తాజాగా యూనిట్ మరో వర్కింగ్ స్టిల్ విడుదల చేసింది. సీన్ పై దర్శకుడితో పవన్ కల్యాణ్ చర్చిస్తున్న పోజు అది. ఇద్దరూ కలిసి ఏదో సీన్ పేపర్ చదువుతున్నారు.
ఇంతకుమించి హరిహర వీరమల్లు సినిమాపై యూనిట్ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. షూటింగ్ ఏ స్టేజ్ లో ఉందనే విషయాన్ని చెప్పలేదు. అయితే హీరోయిన్ నిధి అగర్వాల్ మాత్రం ఈ సినిమా షూటింగ్ అప్ డేట్ ఇచ్చింది.
“హరిహర వీరమల్లు పార్ట్-1 షూటింగ్ కంప్లీట్ అయింది. 2-3 రోజులు వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. మార్చి 28కి తప్పకుండా సినిమా వస్తుంది. రాబోయే వారం పది రోజుల్లో ఓ పాట కూడా రిలీజ్ అవుతోంది.”
రాజమండ్రిలో ఓ షాప్ ఓపెనింగ్ కు వచ్చిన నిధి, ఇలా హరిహర వీరమల్లు అప్ డేట్ ఇచ్చింది నిధి అగర్వాల్. పవన్ కల్యాణ్ లాంటి స్టార్ తో నటించడం తన అదృష్టమన్న ఈ హీరోయిన్, సినిమాకు సంబంధించి తన పార్ట్ షూటింగ్ పూర్తయినట్టు వెల్లడించింది.
అయితే ఇది పార్ట్-1 మాత్రమే, పార్ట్-2కు పవన్ ఎప్పుడు కాల్షీట్లు ఇస్తారనేది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే, ఆయన ఓజీ సినిమా పూర్తి చేయాల్సి ఉంది. అది కూడా చివరి దశ షూటింగ్ లోనే ఉంది. ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ నడుస్తోంది. ఆ షెడ్యూల్ పూర్తయిన తర్వాత, పవన్ తో షూట్ ఉంటుందని అంటున్నారు.
ఈ ఎన్నికలకు సినిమాల్లో ఉన్న రాజకీయ డైలాగులు అన్నీ అయిపోయాయి మళ్ళా దొంగ ముఖం పెట్టుకుని ఇప్పటి నుంచే ఇప్పటినుంచే నెక్స్ట ఎలక్షన్స్ కి రెడీ అవుతున్నాడు !పులి రాజా!!!
Jeggugadu-adi-kuda-cheyakunda-jjako-gadila-palace-lo-thoggunadu-ga…
Waiting ikkada….