ఈ నెలాఖరులో విడుదల అంటూ డేట్ వేసి ప్రచారం ప్రారంభించింది రాబిన్ హుడ్ సినిమా టీమ్. మైత్రీ మూవీస్ నిర్మాణం, వెంకీ కుడుముల దర్శకత్వం, నితిన్-శ్రీలీల కాంబినేషన్. ఇప్పుడు ఈ సినిమా వ్యవహారం వాయిదా దిశగా నడుస్తోంది. పుష్ప 2 కలెక్షన్లు, రన్, జనాల మూడ్, క్రిస్మస్‌కు ఉన్న కాంపిటీషన్ అన్నీ చూసి, విడుదల వాయిదా వేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
హీరో నితిన్ మాత్రం వద్దని అంటున్నట్లు తెలుస్తోంది. అయితే దీని మీద డిస్కషన్లు నడుస్తున్నాయి. నిర్మాతలు మాత్రం వాయిదా వైపే మొగ్గుతున్నారని తెలుస్తోంది. రాబిన్ హుడ్ సినిమాను చాలా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. దాదాపు 70 కోట్లకు పైగా ఖర్చు చేశారు. అందువల్ల థియేటర్ నుంచి గట్టిగా వసూళ్లు రాబట్టాల్సి ఉంది.
పుష్ప 2కు భారీగా ఖర్చు చేసి జనాలు సినిమా చూసారు. జనవరి ఫస్ట్, సంక్రాంతి వస్తోంది. జనాలకు ఖర్చులు ఉంటాయి. ఇలాంటి టైమ్‌లో విడుదల సరికాదనే అభిప్రాయంలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. హీరో పట్టు పట్టినా, ఒప్పించి వాయిదా వేస్తారనే వినిపిస్తోంది.