‘నందమూరి’కి పోటీగా మెగా రాజకీయం

చిరంజీవి కూడా మరోసారి రాజకీయాల్లోకి వచ్చి, రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మెగా కాంపౌండ్ కు, నందమూరి హీరోలకు మధ్య బాక్సాఫీస్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాలుగా అటు చిరంజీవి అభిమానులు, ఇటు బాలకృష్ణ ఫ్యాన్స్ ఈ వార్ ను కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఒక్క విషయంలో మాత్రం నందమూరి వంశం, కాంపౌండ్ కంటే కాస్త ఎక్కువ. అదే రాజకీయం.

మెగా కాంపౌండ్ లో కేవలం హీరోలు మాత్రమే ఉన్నారు. నందమూరి కుటుంబంలో హీరోలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. స్వయంగా బాలకృష్ణ ఎమ్మెల్యే కూడా. హిందూపురం నియోజకవర్గం నుంచి ఓటమి అన్నదే లేకుండా దూసుకుపోతున్నారు.

ఇటు చూస్తే, మెగా కాంపౌండ్ లో రాజకీయంగా మొన్నటివరకు అపజయాలే. చిరంజీవి పొలిటికల్ ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే. పార్టీ పెట్టి, ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసి, ఆ తర్వాత ఆయనే పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కానీ బాలయ్య మాత్రం సక్సెస్ ఫుల్ గా అటు సినిమా, ఇటు పాలిటిక్స్ కొనసాగిస్తున్నారు.

అలా మెగా కాంపౌండ్ పై బాలయ్య రాజకీయ ఆధిపత్యం కొనసాగిందనే చెప్పాలి. అయితే ఇప్పుడీ పరిస్థితిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. నందమూరి పాలిటిక్స్ కు దీటుగా మెగా రాజకీయం కూడా మొదలైంది. ఇకపై మెగా కాంపౌండ్ మనుషులు సినిమా పరంగానే కాదు, రాజకీయంగా కూడా ప్రభావం చూపే స్థాయికి ఎదిగే అవకాశం కనిపిస్తోంది.

ఈ విషయంలో మాత్రం చిరంజీవి కంటే పవన్ కల్యాణ్ కే ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. చిరంజీవి అర్థాంతరంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. పవన్ మాత్రం పదేళ్ల పాటు ఓపిగ్గా ఎదురుచూశారు. అనుకున్నది సాధించారు. తను డిప్యూటీ సీఎం, మినిస్టర్ అవ్వడంతో పాటు.. తనతో పాటు కొందరికి మంత్రి పదవులు ఇప్పించుకోగలిగారు.

ఇప్పుడు తన కుటుంబం నుంచి నాగబాబును కూడా మంత్రివర్గంలోకి తీసుకొచ్చారు. రేపోమాపో చిరంజీవి కూడా మరోసారి రాజకీయాల్లోకి వచ్చి, రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ తెరవెనక చురుగ్గా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

ఇదే కనుక జరిగితే ఇన్నాళ్లూ సినిమాలకే పరిమితమైన మెగా కాంపౌండ్ వ్యక్తులు, రాజకీయంగా కూడా ఎదిగినట్టు అవుతుంది.

11 Replies to “‘నందమూరి’కి పోటీగా మెగా రాజకీయం”

    1. anni rangallo balamaina, danika, united samajaki vargam open ga balayya, cbn ye tha.. ppu chesina nethina pettukutaru.. adi vaallaku varam.. but its not good many times to the society ..

      1. ammadaniki vadevadu, vadi amma m0gudike party nunchi cheppulatho kotti tarimi tarimi kukkani kottinattu kotti party nunchi tarimesaru, edo pillanichi mla ga bathikestunnadu…

  1. ఒ రే య్ గ్యా స్ గా. .., మె గా బ్ర ద ర్స్ ఏ మి రా జ కీ యా లా. కో సం. బా బా యి

    మ ర్డ ర్. చే య లే దు .. క న్న. తం డ్రికి. వె న్ను. పొ ట్టు పొ డ వ లే దు.

    జ ల గ. గా లా. ఆ స్తు లు. కో సం * చె ల్లె ళ్లు & త ల్లి. పై * కే సు లు. పె ట్ట. లే దూ రా

Comments are closed.