ఆళ్ల‌గ‌డ్డ‌కు చేరుకున్న మంచు మ‌నోజ్ దంప‌తులు

దివంగ‌త భూమా శోభా నాగిరెడ్డి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఆమెకు నివాళుల‌ర్పించేందుకు మంచు మ‌నోజ్ దంప‌తులు ఆళ్ల‌గ‌డ్డ వెళ్లారు.

దివంగ‌త భూమా శోభా నాగిరెడ్డి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఆమెకు నివాళుల‌ర్పించేందుకు మంచు మ‌నోజ్ దంప‌తులు ఆళ్ల‌గ‌డ్డ వెళ్లారు. భూమా నాగిరెడ్డి దంప‌తుల చిన్న కుమార్తె మౌనిక‌. ప్ర‌తి ఏడాది త‌ల్లిదండ్రుల వ‌ర్ధంతులు, జయంతుల్ని పుర‌స్క‌రించుకుని మౌనిక ఆళ్ల‌గ‌డ్డ‌లోని భూమా ఘాట్‌కు వెళ్లి నివాళుల‌ర్పిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఇటీవ‌ల కాలంలో మంచు కుటంబంలో ఆస్తుల వివాదం వీధికెక్క‌డంతో మ‌నోజ్‌, ఆయ‌న భార్య ఆళ్ల‌గ‌డ్డ ప‌ర్య‌ట‌న ప్రాధాన్యం సంత‌రించుకుంది. వంద‌లాది వాహ‌నాల‌తో ఆళ్ల‌గ‌డ్డ‌కు చేరుకుని, భూమా ఘాట్ వ‌ద్ద జ‌న‌సేన‌లో చేరుతార‌నే ప్ర‌క‌ట‌న చేస్తార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగింది. అయితే మీడియాలో ప్ర‌చారం జ‌రిగిన‌ట్టు ఏదీ జ‌ర‌గ‌డం లేదు.

ప‌ది లోపు వాహ‌నాల్లో వాళ్లు వెళ్లిన‌ట్టు స్థానికులు చెబుతున్నారు. ఇక రాజ‌కీయంగా కూడా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేసే ఉద్దేశం లేద‌ని మ‌నోజ్ స‌న్నిహితులు అంటున్నారు. ఆళ్ల‌గ‌డ్డ‌లో పుట్టింటికి వెళ్లి, కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసే అవ‌కాశం వుంది.

భూమా మౌనిక‌, ఆమె అక్క అఖిల‌ప్రియ మ‌ధ్య కూడా సంబంధాలు అంతంత మాత్ర‌మే అని తెలిసింది. అయిన‌ప్ప‌టికీ సొంతూరికి వ‌చ్చిన నేప‌థ్యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా అక్క‌ను క‌లిసే అవ‌కాశం వుందని స‌మాచారం. కేవ‌లం మంచు కుటుంబంలో ర‌చ్చ వ‌ల్లే మ‌నోజ్ దంప‌తుల రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది.

3 Replies to “ఆళ్ల‌గ‌డ్డ‌కు చేరుకున్న మంచు మ‌నోజ్ దంప‌తులు”

  1. వీరి చేరికకు జనసేన అధిష్టానం నుండీ అనుమతి రాకపోవడంతో కార్యక్రమం రద్దయ్యింది 😜

  2. once in wrong route, I thought he will do better than that …opch…just survival now money from paternal inheritance or thru second marriage inheritance…

    both proves he is nothing but zero..

    I don’t think he can achieve or have any ambitions at all….

Comments are closed.