జోగితో క‌ల‌వ‌డంపై లోకేశ్ ఆగ్ర‌హం

మాజీ మంత్రి జోగి ర‌మేశ్‌ను క‌లుపుకెళ్లిన టీడీపీ నేత‌ల‌పై మంత్రి నారా లోకేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

మాజీ మంత్రి జోగి ర‌మేశ్‌ను క‌లుపుకెళ్లిన టీడీపీ నేత‌ల‌పై మంత్రి నారా లోకేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఉమ్మ‌డి కృష్ణా జిల్లా నూజివీడులో గౌతు ల‌చ్చ‌న్న విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు మంత్రి పార్థ‌సార‌థి, ఎమ్మెల్యే గౌతు శిరీష్ ఊరేగింపుగా వెళ్లారు. వీళ్ల‌తో క‌లిసి అదే వాహ‌నంలో జోగి ర‌మేశ్ ఊరేగింపుగా వెళ్లారు.

దీంతో టీడీపీలో జోగి ర‌మేశ్ చేరుతార‌న్న ప్ర‌చారం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. గ‌తంలో వైసీపీ హ‌యాంలో చంద్ర‌బాబునాయుడి ఇంటిపైకి జోగి నేతృత్వంలో దాడికి వెళ్లారు. అప్ప‌ట్లో జోగి ర‌మేశ్‌, టీడీపీ నేత‌ల మ‌ధ్య చంద్ర‌బాబు ఇంటి వ‌ద్ద పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. నాటి నుంచి జోగి ర‌మేశ్‌పై టీడీపీ తీవ్ర ఆగ్ర‌హంగా వుంది.

అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్య‌వ‌హారంలో అక్ర‌మాలు జ‌రిగాయంటూ జోగి ర‌మేశ్ కుమారు రాజీవ్‌ను కూట‌మి స‌ర్కార్ అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వానికి జోగి ర‌మేశ్ భ‌య‌ప‌డుతున్నారు. దీంతో ఆయ‌న టీడీపీలో చేరాల‌నే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ ఆయ‌న్ను మైల‌వ‌రం వైసీపీ ఇన్‌చార్జ్‌గా నియ‌మించారు.

తాను టీడీపీలో చేరుతార‌నే ప్ర‌చారాన్ని ఇటీవ‌ల జోగి ఖండించారు. అయితే గౌతు ల‌చ్చ‌న్న విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు టీడీపీ నేత‌ల‌తో క‌లిసి వెళ్ల‌డంపై లోకేశ్ ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు తెలిసింది. అస‌లేం జ‌రిగిందో ఆయ‌న ఆరా తీస్తున్నార‌ని స‌మాచారం. జోగిని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ద‌గ్గ‌రికి తీసుకోవ‌ద్ద‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌నేందుకు లోకేశ్ కోప‌మే నిద‌ర్శ‌నం.

9 Replies to “జోగితో క‌ల‌వ‌డంపై లోకేశ్ ఆగ్ర‌హం”

  1. జోగి, కొడాలి, వంశీ ఇటువంటి వార్ని టిడిపి చేర్చుకుంటే టిడిపి సపోర్టర్స్ ఫూల్స్ అయినట్టే

  2. టీడీపీ.పదికాలాల పాటు వుండాలంటే ఇలాంటి లంగా గాళ్లని దూరం పెట్టాల్సిందే

  3. జోగి గారు కాదేమో సరిగ్గా చూడండి, సెక్స్యూరిటీ కోసం వచ్చిన గూర్ఖా అయ్యుంటాడు, జోగి గారు నిబద్ధత కలిగిన వైసీపీ నాయకుడు, ఎందుకు వస్తాడు గౌడ కులసంఘ ఈవెంట్ కి..

  4. టీడీపీ లోకి జోగి రమేష్ అంటా? నమ్మలేక పోతున్నా !

    అదే జరిగితే టీడీపీ కి గుడ్బాయ్ .. సిగ్గు శరం లేని నారా కుటుంబం / టీడీపీ కుటుంబం నుంచి బయటకు రావడమే బెటర్ .

  5. టీడీపీ లోకి జోగి రమేష్ అంటా? నమ్మలేక పోతున్నా !

    అదే జరిగితే టీడీపీ కి గుడ్బాయ్ .. సి గ్గు శరం లేని నారా కుటుంబం / టీడీపీ కుటుంబం నుంచి బయటకు రావడమే బెటర్ .

  6. టీడీపీ లోకి జోగి రమేష్ అంటా? నమ్మలేక పోతున్నా !

    అదే జరిగితే టీడీపీ కి గుడ్బాయ్ .. సి గ్గు/ శ రం లేని నారా కుటుంబం / టీడీపీ కుటుంబం నుంచి బయటకు రావడమే బెటర్ .

Comments are closed.