పాపం.. రాబిన్ హుడ్

రాబిన్ హుడ్ క్రిస్మస్ బరి నుంచి తప్పుకున్నాడు. మరి తరువాత డేట్ ఎప్పుడు? సంక్రాంతి? అదీ సమస్యగానే వుంది.

ఒకటే బ్యానర్ సినిమా కావడం, అదే బ్యానర్ లో వచ్చిన భారీ సినిమా తరువాత డేట్ పడడం అన్నవి శాపాలుగా మారిపోయాయి నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమాకు. రాబిన్ హుడ్ సినిమాకు క్రిస్మస్ డేట్ వేసారు మేకర్లు. అప్పుడే జనం అనుమాన పడ్డారు. పుష్ప 2 వచ్చిన మూడు వారాలకు ఎలా డేట్ వేసారో అని. ఎందుకంటే రెండు సినిమాలు ఒక బ్యానర్ వే. పష్ప 2 బ్లాక్ బస్టర్ అయినా రాబిన్ హుడ్ రాదు. పుష్ప 2 యావరేజ్ అయినా రాబిన్ హుడ్ రాదు అని అప్పుడే జోస్యం చెప్పారు.

ఇప్పుడు అదే జరిగింది. అసలు పుష్ప2 హడావుడిలో పడి రాబిన్ హుడ్ ను పట్టించుకునే టైమ్ లేదు నిర్మాతలకు. దాంతో ప్రచారం అన్నదే జరగలేదు. పుష్ప 2 థియేటర్లలో బాగానే వుంది. ఇంతో అంతో షేర్ లాగుతోంది. క్రిస్మస్ సీజన్ లో ఎలా లేదన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ అయిదు నుంచి పది కోట్లు లాగుతుంది. రాబిన్ హుడ్ అదే సీజన్ లో అంత లాగుతుందో లేదో తెలియదు. అందువల్ల పుష్ప 2 ను తీసేసి రాబిన్ హుడ్ ఎలా వేస్తారు.

అదే జరిగింది. రాబిన్ హుడ్ క్రిస్మస్ బరి నుంచి తప్పుకున్నాడు. మరి తరువాత డేట్ ఎప్పుడు? సంక్రాంతి? అదీ సమస్యగానే వుంది. ఎందుకంటే రామ్ చరణ్, బాలయ్య లాంటి వారితో వున్న సంబంధాలు చెడిపోకూడదు. లాస్ట్ మినిట్ లో వాళ్ల సినిమాలకు పోటీగా తమ సినిమాను దింపకూడదు. పైగా థియేటర్ల సమస్య వుండనే వుంటుంది. పైగా సంక్రాంతి సీజన్ లో కూడా పుష్ప 2 కు కొన్నయినా థియేటర్లు వుంటాయి కదా.

అందుకే ఇప్పుడు రాబిన్ హుడ్ ఏకంగా శివరాత్రి డేట్ కు వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలా అని అక్కడా అంత వీజీగా లేదు. విష్వక్ సేన్ లైలా, సితార సంస్థ మ్యాడ్ 2 సినిమాలు వున్నాయి. మొత్తానికి రాబిన్ హుడ్ కు టఫ్ టైమ్ నడుస్తోంది.

2 Replies to “పాపం.. రాబిన్ హుడ్”

Comments are closed.