బన్నీ అరెస్టుపై ప్రజల అభిప్రాయం ఏంటి?

ఈ మొత్తం వ్యవహారంపై సామాన్య జనం ఏమనుకుంటున్నారు? వాళ్ల స్పందన ఎలా ఉంది? దీనిపై ఓ జాతీయ మీడియా సర్వే నిర్వహించింది.

అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. ఒక రాత్రి జైళ్లో ఉన్నాడు. పొద్దునే బయటకొచ్చాడు. అతడికి మద్దతుగా టాలీవుడ్ మొత్తం కదిలొచ్చింది. దీనికి నేషనల్ మీడియా “బెయిల్ సెలబ్రేషన్స్” అని ముద్దు పేరు పెట్టింది.

మరోవైపు బన్నీ వ్యవహారశైలిపై దుమ్మెత్తిపోసే బ్యాచ్ కూడా రెడీ అయింది. రాత్రి బన్నీ కూడా బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదనే అంశంపై స్పందించాడు.

ఇలా అల్లు అర్జున్ వివాదంపై 2 గ్రూపులుగా ఏర్పడి విమర్శలు-ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై సామాన్య జనం ఏమనుకుంటున్నారు? వాళ్ల స్పందన ఎలా ఉంది? దీనిపై ఓ జాతీయ మీడియా సర్వే నిర్వహించింది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసింది.

– తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ పై మీరేమంటారు?

తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందంటూ 34శాతం మంది స్పందించగా.. తెలంగాణ పోలీస్ చర్య చట్టబద్దంగానే ఉందంటూ 33 శాతం మంది స్పందించారు. ఇక ఈ అంశంపై స్పందించలేమంటూ 14శాతం మంది, సమాధానం ఇవ్వడం ఇష్టంలేదంటూ మరో 19 శాతం మంది స్పందించారు.

– భారీగా వచ్చిన ప్రజల్ని అదుపుచేయడంలో ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించిందా?

దీనికి 41 శాతం మంది ‘అవును’ అంటూ సమాధానం ఇచ్చారు. 32 శాతం మంది ‘కాదు’ అని చెప్పగా.. 27 శాతం మంది ఈ ప్రశ్నకు దూరంగా ఉన్నారు.

– అల్లు అర్జున్ అరెస్ట్ పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి..?

అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం హడావుడి చేసిందని, దీన్ని తొందరపాటు చర్యగా 40 శాతం మంది భావించారు. ఈ విషయంలో బన్నీని అరెస్ట్ చేసి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని 41 శాతం మంది అభిప్రాయపడ్డారు. 20 శాతం మంది ఏం చెప్పలేమన్నారు.

పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా అల్లు అర్జున్ ఓపెన్ టాప్ కారులోంచి ప్రేక్షకులకు అభివాదం చేశాడు. బన్నీ వచ్చిన విషయం తెలుసుకొని ప్రేక్షకులు ఒక్కసారిగా అటువైపు దూసుకురావడంతో, తొక్కిసలాట లాంటిది జరిగిందని, దీనికితోడు బన్నీ కారుకు లైన్ క్లియర్ చేసేందుకు ప్రైవేట్ భద్రతా సిబ్బంది ఎక్కువమంది ప్రజల్ని నెట్టేయడం కూడా తొక్కిసలాటకు కారణమైందని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

3 Replies to “బన్నీ అరెస్టుపై ప్రజల అభిప్రాయం ఏంటి?”

  1. ప్రజల అభిప్రాయం ఎవరికీ కావాలి? ఈ అరెస్టుతో ఫ్రీ పబ్లిసిటీ దొరికిందిగా, ఇంకా ప్రజలు/ ప్రేక్షకుల అభిప్రాయం ఎవరికీ అక్కర్లేదు

  2. అల్లు అర్జున్ రెడ్డి గాడి కి ఏం జరిగిందని సినీ పరిశ్రమ మొత్తం ఆయన వెనకాల తిరుగుతుంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆబాబును కనీసం ఈ ఒక్క లంజకొడుకైన పరామర్శించడానికి వెళ్ళాడా ? ఆ వెధవలు సి గ్గు సరం ల జ్జ మానం న్యాయం ధర్మం ఏవీ లేవు…దొంగనాకొడులు అందరూ.!

Comments are closed.