డాకూ కాదు ముద్దుల మామయ్య

డాకూ మహరాజ్ యూనిట్ ఓ మంచి ఫ్యామిలీ స్టిల్స్ వదలింది. ఆ స్టిల్స్ లో బాలయ్య తో పాటు ఓ చిన్న పాప కనిపిస్తోంది.

డాకూ మహరాజ్ టైటిల్ వచ్చింది. ఎలా వుండబోతోందో చెప్పే గ్లింప్స్ వచ్చింది. దాంతో బందిపోట్ల నేపథ్యంలో జరిగే కథ అనే ఐడియా వచ్చింది. బాబీ దర్శకుడు కనుక చాలా ఇంటెన్సివ్ యాక్షన్ సినిమా తీస్తున్నారని అర్థం అయింది.

అయితే సినిమాలో ముగ్గురు నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఎవరు అసలు సిసలు హీరోయిన్ నో, అసలు ఎవరు ఏ పాత్ర చేస్తున్నారో అన్నది తెలియదు. ప్రగ్య జైస్వాల్, శ్రద్ధ శ్రీనాధ్ ప్రధానంగా వున్నారు. వీరిలో ఎవరు బాలయ్య పక్కన కీలకంగా కనిపిస్తారో తెలియదు.

ఇలాంటి నేపథ్యంలో డాకూ మహరాజ్ యూనిట్ ఓ మంచి ఫ్యామిలీ స్టిల్స్ వదలింది. ఆ స్టిల్స్ లో బాలయ్య తో పాటు ఓ చిన్న పాప కనిపిస్తోంది. అఖండ సినిమాలో చిన్నపాప పాత్రనే కీలకం, భగవంత్ కేసరి సినిమాలో చిన్నపాప, ఆమెతో లాలి ఆట పాట కీలకం. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటిది ఏదో వున్నట్లు కనిపిస్తోంది. ఇలా రెండు ఫ్యామిలీ స్టిల్స్ వదిలిన తరువాత మళ్లీ ఓ మాస్ స్టిల్ కూడా వదిలింది యూనిట్.

ఆ స్టిల్ లో బాలయ్య ఓ రగ్డ్ జీప్ ను డ్రయివ్ చేస్తున్నట్లు వుంది. అంటే సినిమా ఇటు మాస్ అటు క్లాస్ టచ్ తో వుంటుందని అర్థం అవుతోంది. ఈ విషయాన్ని కన్వే చేయడానికే యూనిట్ వన్ బై వన్ స్టిల్స్ వదులుతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో గేమ్ ఛేంజర్ యూత్ ను టార్గెట్ చేస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్యామిలీలను టార్గెట్ చేస్తుంది. బాలయ్య సినిమా అటు మాస్ ను ఇటు క్లాస్ ను టార్గెట్ చేస్తుందేమో చూడాలి.

3 Replies to “డాకూ కాదు ముద్దుల మామయ్య”

Comments are closed.