బన్నీ ఇంటిపై దాడి చేసింది ఎవరు?

కాంగ్రెస్ పార్టీ వాళ్లేమో వాళ్ళు బీఆర్ఎస్ మనుషులని చెబుతున్నారు. వాళ్ళు కేటీఆర్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టింది.

అల్లు అర్జున్ ఇంటిపై కొందరు దాడి చేశారు. పూల కుండీలు పగులగొట్టారు. నినాదాలు చేశారు. నిరసనలు తెలిపారు. పోలీసులు వారిని అరెస్టు చేశారనుకోండి. కానీ దాడి చేసింది ఎవరనే దానిపై రకరకాల కథనాలు మీడియాలో వచ్చాయి.

ఓయూ జేఏసీ నేతలు దాడి చేశారని వార్తలు వచ్చాయి. కానీ వాళ్ళు ఓయూ జేఏసీ నేతలు కాదని పోలీసులు చెప్పారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని, రేవంత్ రెడ్డి అనుచరులని బీఆర్ఎస్ చెబుతోంది. వాళ్ళు రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోలు కూడా నమస్తే తెలంగాణా పత్రిక ప్రచురించింది.

కాంగ్రెస్ పార్టీ వాళ్లేమో వాళ్ళు బీఆర్ఎస్ మనుషులని చెబుతున్నారు. వాళ్ళు కేటీఆర్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టింది. ఇంతకూ వాళ్లెవరనేది గందరగోళంగా ఉంది. అల్లు అర్జున్ ఉదంతంతో రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్ఎస్, బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

చిత్ర పరిశ్రమపై కక్షగట్టాడని అంటున్నాయి. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే అల్లు అర్జున్ ను వేధిస్తున్నాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నాడు. గతంలో సీఎం సోదరులవల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ రాసి మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించాడు.

బీఆర్ఎస్ కూడా ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తం చేస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా రేవంత్ తీరును నిరసించింది. ఈ కేసులో ఇంకా చాలామంది ఉండగా అల్లు అర్జున్ మీదనే కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించింది. తెలంగాణలో ఇకముందు బెనిఫిట్ షోలు ఉండవని రేవంత్ రెడ్డి ప్రకటించడంపట్ల కూడా ఏపీలో నిరసన వ్యక్తం అవుతోంది.

మొత్తంమీద సంధ్య థియేటర్ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత ప్రబలుతోంది. ఆయన సినిమాలకు నంది అవార్డులకు బదులు గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించినప్పుడు పరిశ్రమ నుంచి స్పందన రాలేదు.

దీనిపై రేవంత్ రెడ్డి కూడా నిరసన వ్యక్తం చేశాడు. చివరకు చిరంజీవి మరికొందరు స్వాగతించారు. మొత్తం మీద రేవంత్ రెడ్డికి చిత్ర పరిశ్రమకు దూరం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది.

3 Replies to “బన్నీ ఇంటిపై దాడి చేసింది ఎవరు?”

  1. డెఫినిట్ గా కేటీఆర్ ప్లాన్. వాడిని అరెస్ట్ చేసి బొక్కలో వెస్సంత వరకు ఈలన్నతవి ఆగవు.

Comments are closed.