యువగళం పాదయాత్రలో టీడీపీ భవిష్యత్ రథ సారథి నారా లోకేశ్ రెడ్‌బుక్ రాసుకున్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే పోలీస్, ఇతర శాఖల అధికారులు , అలాగే వైసీపీ నాయకుల పేర్లను రాసుకుంటున్నట్టు ఆయన చెప్పేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ల అంతు చూసే బాధ్యతను తాను తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మొహమాటంగా రెడ్‌బుక్‌లో ఇప్పటి వరకు ఎన్ని చాప్టర్లు తెరిచారో కూడా ఆయన ప్రకటించారు.
అయితే రెడ్‌బుక్‌లో టీడీపీ సీనియర్ నేతల గురించి కూడా ఆయన రాసుకున్నట్టు పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది. ఉదాహరణకు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, మంత్రి అచ్చెన్నాయుడు తదితరుల గురించి మాట్లాడుకుంటున్నారు. కనీసం అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి ఇచ్చారు. అంతకు మించి ఆయనకు ప్రాధాన్యం లేదు. అందుకే అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నా లేరనే భావన కలుగుతోంది.
గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై చంద్రబాబుకే పాత కక్ష వుంది. ఎన్టీఆర్‌ను గద్దె దించినప్పుడు తన గురించి చాలా ఎక్కువ మాట్లాడారనే కోపం బుచ్చయ్యపై బాబుకు ఉండడం వల్లే, ఎమ్మెల్యే సీటు తప్ప, అంతకు మించి ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వని సంగతి తెలిసిందే. చివరికి వైసీపీ నుంచి తీసుకున్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారే తప్ప, బుచ్చయ్యను మాత్రం దూరం పెట్టారు.
అలాగే 2019లో అధికారం పోయిన తర్వాత లోకేశ్, చంద్రబాబుపై బుచ్చయ్య ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇవన్నీ లోకేశ్ మనసులో ఉన్నాయి. యనమల రామకృష్ణుడు, పట్టాభి లాంటి నాయకులంతా లోకేశ్ గురించి ఆఫ్ ది రికార్డ్‌గా నెగెటివ్‌గా మాట్లాడుతున్నారనే ఆరోపణ లేకపోలేదు. అందుకే పట్టాభికి కనీసం అపాయింట్మెంట్ కూడా లోకేశ్ ఇవ్వరు. ఒక్కసారి లోకేశ్ దృష్టిలో వ్యతిరేక భావన ఏర్పడితే, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లను ఎదగనివ్వరనే టాక్ టీడీపీలో వుంది.
అందుకే పదవులు దక్కని, ఏ మాత్రం పనులు కాని టీడీపీ నేతలంతా తాము లోకేశ్ రెడ్‌బుక్‌లో ఉన్నోళ్లమని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. లోకేశ్ టీమ్‌లో తాము లేమని, పైగా ఆయనకు టార్గెట్ అయ్యామని కూడా సీనియర్ నాయకులు మాట్లాడుతున్నారు. తనకంటూ ఒక టీమ్‌ను ఏర్పరచుకుని, ముందుకెళ్లాలనే దృఢమైన ఆలోచనతో లోకేశ్ ముందుకెళుతున్నారు. అధికారం ఉన్నా, లేకపోయినా తన వెంట ఉంటారనే నమ్మిన వాళ్లనే లోకేశ్ ఆదరిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
లోకేష్ సంగతి ఏమో కాని …మన అన్న పాలస్ దర్శనం సజ్జల , పెద్దిరెడ్డి కి తప్ప ఇంకెవరికీ మోక్షం లేదంటే కదా?అదే విషయం, మాగుంట, వేమిరెడ్డి, వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారుగా…చివరికి జక్కంపూడి రాజా వంటి వారు కూడా బయటపడ్డారు
Singapore pulakesi
మన అన్న హయాంలో ఎంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చారు ఎంతమందితో కలిసి మాట్లాడాడు. అంతా సకల శాఖామంత్రి సజ్జలనే కదా
పెద్దపెద్ద తలకాయలకి దిక్కుమొక్కు లేకుండా పోయింది. మరి వాళ్లంతా ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే అనుకోని ఉంటారు కదా ? వాళ్లంతా బాధితుల కిందనే లెక్క కదా ? అటు టిడిపి వారు కానివ్వండి ఇటు వైసిపి వారు కానివ్వండి వారికీ లేని బాధ నీకెందుకురా గ్యాస్ ఆంధ్ర ? కాయకు లేని దురద కట్టి కెందుకు అన్న సామెత నీకు అక్షరాలా సరి పోతుందిరా గ్యాస్ ఆంధ్ర. వారికి గుద్ధ నొప్పి ఉందో లేదో తెలియదు కానీ వారి తరఫున నీకు మాత్రం గుద్దు నొప్పి ఎక్కువైనట్టుంది . అందుకే తట్టుకోలేకపోతున్నావు. ఆ నొప్పితో ఏదో అవాకలు, చవాకులు పేలుతున్నావు. ఐదేళ్లు నువ్వు రాసిన పనికిమాలిన రాతలు ఒక్కటి కూడా పనిచేయలేదు అన్నను తిరిగి గద్దె ఎక్కించలేకపోయాయి. అటువంటి అప్పుడు ఈ సొల్లు కబుర్లు ఎందుకురా గ్యాస్ ఆంధ్ర
Mee red book ki bhayapadi vaadu yevaru leruu prajala dabbulu dopidi chesi Swiss bank lo dachukovadam prajalu ki telusu