రేవంత్ రెడ్డికి ఉమ్మడి రాష్ట్రమే నచ్చింది!

సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి రాష్ట్రమే నచ్చింది. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి రాష్ట్రమే నచ్చింది. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందనే కదా భారీ ఉద్యమం నడిపి ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరిగిందనే ప్రధాన నినాదంతో తెలంగాణ ఉద్యమం నడిచింది.

అన్ని పార్టీలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసినా తెలంగాణ సాధించిన నాయకుడిగా కేసీఆర్‌కు పేరు వచ్చింది. రాష్ట్రం ఏర్పడగానే ఆయనే రెండుసార్లు సీఎం అయిన విషయం తెలిసిందే కదా. పదేళ్లలో ఆయన పరిపాలనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదనే విమర్శలు తీవ్రంగా వచ్చాయి.

ప్రతిపక్షాలు అనేకసార్లు పోరాటాలు చేశాయి. ఉద్యమించాయి. కేసీఆర్ పరిపాలనను దృష్టిలో పెట్టుకొని కావొచ్చు రేవంత్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నామని చెప్పారు. ఉద్యోగ ఉపాధి కోసమే యువత తెలంగాణ సాధించుకున్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రంలో వారికి అన్యాయం జరిగిందని అన్నారు.

ప్రత్యేక రాష్ట్రంలో అన్యాయం జరిగిందంటే కేసీఆర్ హయాంలో అన్యాయం జరిగిందని అర్థం. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై గులాబీ పార్టీ మండిపడుతోంది. సీఎం తెలంగాణ రాష్ట్రం మీద విషం చిమ్ముతున్నాడని ఆగ్రహించింది.

4 Replies to “రేవంత్ రెడ్డికి ఉమ్మడి రాష్ట్రమే నచ్చింది!”

Comments are closed.