కేటీఆర్‌కు షాక్.. అరెస్ట్‌పై స్టే ఎత్తివేసిన హైకోర్టు!

ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.

ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై న‌మోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ వాదనలను ప‌రిగ‌ణన‌లోకి తీసుకున్న న్యాయ‌స్థానం, ఆయ‌న అరెస్ట్‌పై ఉన్న స్టే కూడా ఎత్తివేసింది.

కాగా, ఇవాళ ఇదే కేసులో ఈడీ ఎదుట కేటీఆర్ హాజరుకావాల్సి ఉండగా, హైకోర్టు తీర్పు నేప‌థ్యంలో కేటీఆర్ రిక్వెస్ట్‌తో ఈడీ కేసీఆర్‌కు ఇవాళ హాజరుకు మినహయింపు ఇచ్చింది. అదే విధంగా నిన్న కూడా ఏసీబీ ఆఫీసు దగ్గర లోపలకు వెళ్లకుండా హైడ్రామా సృష్టించారు కేటీఆర్. తన న్యాయవాదుల‌తో పాటే విచార‌ణ అధికారుల ముందుట హాజర‌వుతాన‌ని పట్టుపట్టడం, దానికి పోలీసులు ఒప్పుకోకపోవడంతో ఏసీబీ అధికారుల ముందు విచారణ‌కు హాజరు కాకుండా ఇంటికి వెళ్లిపోయారు.

ఇవాళ కేటీఆర్ క్వాష్ పిటిషన్ న్యాయ‌స్థానం కొట్టివేయ‌డంతో పాటు ఆయ‌న అరెస్ట్‌పై ఉన్న స్టే కూడా ఎత్తివేయడంతో కేటీఆర్ అరెస్ట్ అవుతారని అంద‌రూ భావిస్తున్నారు. ఏది ఏవైనా, కేటీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణ రాజ‌కీయాలు కీల‌క మలుపు తిరిగే అవ‌కాశం ఉంది. మరోవైపు ఉన్నత న్యాయస్థానం తీర్పుపై కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చిస్తున్నారు. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.

ఇప్ప‌టీకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హారీష్ రావులు కాళేశ్వ‌రంలో అవినీతి చేశార‌ని వారిపై విచార‌ణ‌కు క‌మిష‌న్ కూడా ఏర్పాటు చేశారు. కేటీఆర్ అరెస్ట్ అయిన కొన్ని రోజుల్లోనే కేసీఆర్, హారీష్ రావులు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్ప‌టికే కేసీఆర్ కుటుంబం ప‌ట్ల సీఎం రేవంత్ రెడ్డి ఉదారత‌తో ఉన్నారని, వారి అవినీతిని బ‌య‌టికి తీయాలని బీజేపీ నేత‌లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

6 Replies to “కేటీఆర్‌కు షాక్.. అరెస్ట్‌పై స్టే ఎత్తివేసిన హైకోర్టు!”

Comments are closed.