తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఈ ఘటనకు బాధ్యులుగా భావించిన ప్రభుత్వం తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ తిరుపతి జేఈవో గౌతమి, అలాగే సీఎస్‌వో శ్రీధర్‌ను తక్షణమే బదిలీ చేశారు. అలాగే డీఎస్పీ రమణకుమార్తో పాటు గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు తెలిపారు.
తిరుపతిలో దుర్ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ నగరానికి వెళ్లారు. దుర్ఘటన చోటు చేసుకున్న నగరంలోని బైరాగిపట్టెడలోని పార్కును పరిశీలించారు. సంఘటన జరిగిన తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో సమీక్షించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధ్యులపై చర్యలు తీసుకున్నామని, అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపిస్తామని ఆయన అన్నారు. టీటీడీ నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల ఆర్థిక సాయం, అలాగే ఒకరికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగం ఇస్తామన్నారు. తీవ్రంగా గాయపడిన తిమ్మక్క, ఈశ్మరమ్మలకు రూ.5 లక్షలు చొప్పున అందజేస్తామన్నారు. గాయాలపాలైన మరో 33 మందికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చొప్పున అందజేయనున్నట్టు సీఎం తెలిపారు.
మన వాళ్ళని ఎం చెయ్యలేదు కదా.. హమ్మయ్య ఓకే..
ichindi Kuda TTD account lo nundi
Ya mistake chesindi ttd officials kada tappemundi?
Prompt action appreciated.
కాంట్రాక్టు జాబ్ కాకుండా పెర్మనెంట్ జాబ్ ఇస్తే బాగుండేది
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
యాక్షన్ షాట్ ఒకటి- కట్ ఆడియో రికార్డ్ అవలేదు,
ఓకే యాక్షన్ 2- మైక్ పెట్టరు, Shot ok పర్ఫెక్ట్ యాక్టింగ్
Cbn vision 20 20