ప‌వ‌న్‌…ఇదీ గేమ్ ఛేంజ‌ర్ అంటే?

టీటీడీ చైర్మ‌న్‌, ఈవో, ఏఈవోల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం వెనుక ప‌వ‌న్ ఉద్దేశంపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై నెమ్మ‌దిగా అనుమానాలు త‌లెత్తుతున్నాయి. టీటీడీ చైర్మ‌న్‌, ఈవో, ఏఈవోల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం వెనుక ప‌వ‌న్ ఉద్దేశంపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా పిఠాపురంలో తిరుప‌తి తొక్కిస‌లాట‌కు సంబంధించి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌నే డిమాండ్‌ను ప‌వ‌న్ తెర‌పైకి తేవ‌డం వెనుక‌, వాళ్ల‌ను ర‌క్షించే బాధ్య‌త‌ను నెత్తికెత్తుకున్నారా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

తిరుప‌తిలో తొక్కిస‌లాట‌పై మ‌రోసారి డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఘోర దుర్ఘ‌ట‌న‌కు బాధ్య‌త వ‌హించి టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి, అలాగే టీటీడీ బోర్డు స‌భ్యులు క్ష‌మాప‌ణ‌లు చెప్పితీరాల్సిందే అని ప‌వ‌న్ హెచ్చ‌రించారు. ఇంకోదారి కూడా లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

పిఠాపురంలో ఆయ‌న మాట్లాడుతూ క్ష‌త‌గాత్రుల్ని ప‌ల‌క‌రించిన‌ప్పుడు, వాళ్ల వేద‌నాభ‌రిత క‌థ‌ల్ని వింటుంటే క‌న్నీళ్లు వ‌చ్చాయ‌న్నారు. త‌మిళ‌నాడుకు చెందిన ఒక పెద్దావిడ‌ను ఏం జ‌రిగింద‌ని అడ‌గ్గా ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని చెప్పార‌న్నారు. ఏం చేస్తాం, మా ఖ‌ర్మ ఇలా కాలింద‌ని ఆమె అన్న మాట‌లు విని క‌రిగిపోయాన‌ని ప‌వ‌న్ తెలిపారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటన తనను చాలా బాధించిందన్నారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట‌లు వింటే, ఎవ‌రికైనా అబ్బో డిప్యూటీ సీఎంలో ఎంత చిత్త‌శుద్ధి వుందో అనిపిస్తుంది. ఇది నాణేనికి ఒక‌వైపు. ప‌వ‌న్ తీరు అనుమానాస్ప‌దంగా ఉంద‌న్న వాళ్ల అభిప్రాయాల్ని నాణేనికి రెండో వైపుగా చూడాలి.

తాను క్షమాపణలు చెప్పిన తర్వాత, మీరు చెప్పడానికి వచ్చిన నామోషీ ఏంటని పవన్ కల్యాణ్ నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం. క్ష‌మాప‌ణ‌లు చెప్పించ‌డంతో తొక్కిస‌లాట దుర్ఘ‌ట‌న‌ను సుఖాంతంగా ముగించే ఎత్తుగ‌డ క‌నిపిస్తోంద‌నే వాద‌న తెర‌పైకి వ‌చ్చింది. తొక్కిస‌లాట బాధితుల గోడు త‌న‌కు క‌న్నీళ్లు తెప్పించాయంటున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ ఎందుక‌ని అందుకు కార‌ణ‌మైన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రిపై వెంట‌నే కేసు పెట్టించి, విచార‌ణ‌కు ఆదేశించాల‌ని సీఎం చంద్ర‌బాబును కోర‌లేద‌నే నిల‌దీత ఎదుర‌వుతోంది.

ఇదే ఒక ప్రైవేట్ వ్య‌క్తి చేప‌ట్టిన కార్య‌క్ర‌మంలో తొక్కిస‌లాట జ‌రిగి మ‌నుషుల ప్రాణాలు పోవ‌డం, అలాగే గాయాల‌పాలైతే… క్ష‌మాప‌ణ చెప్పించుకుని విడిచి పెడ‌తారా? అని కొంద‌రు నిల‌దీస్తున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ వేదిక‌లెక్కి, అలాగే మీడియా ఎదుట సినిమా డైలాగ్‌లు చెప్ప‌డం మానేసి, చ‌ట్ట‌ప్ర‌కారం బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎంపై ఒత్తిడి తీసుకొచ్చి, త‌న చిత్త‌శుద్ధిని చాటుకోవాల‌ని హిత‌వు చెబుతున్నారు.

నిజంగా పొలిటిక‌ల్ గేమ్ ఛేంజ‌ర్ కావాలంటే, ప్ర‌భుత్వంలో కీల‌క ప్రాతినిథ్యం వ‌హిస్తున్న నాయ‌కుడిగా బాధితుల వైపు నిల‌బ‌డాల‌నే డిమాండ్ వ‌స్తోంది. ఇంత‌కంటే ప‌వ‌న్‌కు మ‌రో మార్గం లేద‌ని ప్ర‌జాస్వామిక వాదులు కోరుతున్నారు. చ‌ట్టం ఉండ‌గా, క్ష‌మాప‌ణ‌ల‌తో ప‌నేంట‌ని ప‌వ‌న్‌ను ప్ర‌శ్నిస్తున్నారు.

20 Replies to “ప‌వ‌న్‌…ఇదీ గేమ్ ఛేంజ‌ర్ అంటే?”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. గేమ్ చేంజర్ అంటే దీనికేదో డిమాండ్ బాగుందని జెగ్గులు గాడు

    “వీధికొక వైకుంఠద్వారం” సెట్టింగ్ వేయించి దర్శన యాపారం చెయ్యడం

  3. బాబాయ్ కేసులో జగనం బాధితుల వైపు నిలబడ్డాడా పిల్లగా వెంకటి?

  4. ఇంకా నయం….game changer లో మోపిదేవి character ye నిజమైన హీరో అని, దాన్ని inspiration గా తీసుకోవాలని demand చేయలేదు 🙏🙏🙏….thank you GA

  5. Orey panikimalina gadidha. Nuvvu asalu journalist vena ycheap ki chemchagiri chesthunnav…. ycheap prasadam kalthi chesinappudu amaindhi ni pichi rathalu.chethilo em pettukunnav appudu ..

  6. GA,నీతుల గురించి చెప్పడానికి ముందు, నువ్వే నిన్ను గురించి ఆలోచించు. అసలు నీకు అలాంటి మాటలు చెప్పడానికి అర్హత ఉందా?

    1. G A ఎమన్నా మంత్రి లేక DCM ఆహ్. ఓక సామాన్య మనిషి, వెబ్‌సైట్ బిజినెస్ చేస్తున్నాడు అంతే , ఏమైన రాయవచ్చు , నాచితే చదువు , లేక పోతేర్ ఇంకా ఎప్పుడు ఈ వెబ్‌సైట్ ని ఓపెన్ చెయ్యకు

  7. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  8. నాణెం కు 3వ వైపు ఉంది నిలువు…

    ఎంత ఇస్తారు?

    ఇచ్చిన వారి వైపు మాట్లాడతా..

Comments are closed.