టాలీవుడ్ సినిమాల విడుదలలు అన్నీ ఫ్రభావం చేసే స్టామినా వుంది ఆర్ఆర్ఆర్ కు. ఆ సినిమా ఈ ఏడాదే విడుదలవుతుందని టాక్. అలా కాకుండా 2022 సంక్రాంతికి వెళ్లిందో టాలీవుడ్ లో చాలా సినిమాల విడుదల అయోమయంలో పడిపోతుంది. అన్నీ కట్టకట్టుకుని నాలుగైదు నెలలు వెనక్కు వెళ్లిపోవాల్సి వస్తుంది.
అయితే లేటెస్ట్ గా బయటకు వచ్చిన సంగతి అక్టోబర్ 8న ఆర్ఆర్ఆర్ విడుదలవుతుందని. సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న విదేశీ నటి తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ మేరకు ఓ ఫోస్ట్ పెట్టి, చటుక్కున డిలీట్ చేసేసింది. కానీ అప్పటికే జనాల్లోకి వెళ్లిపోయిందా సంగతి.
దాంతో ఆర్ఆర్ఆర్ విడుదల అక్టోబర్ ఎనిమిది అంటూ ఇటు మెగా ఫ్యాన్స్, అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ హడావుడి ప్రారంభించేసారు. ఆ సంగతి ఎలా వున్నా, అదే నిజమైతే టాలీవుడ్ లో చాలా పెద్ద సినిమాలు ఊపిరిపీల్చుకుంటాయి.
బన్నీ, ఎన్టీఆర్, పవన్, మెగాస్టార్ ఇలా చాలా పెద్ద సినిమాలు షూట్ లో వున్నవి, షూటింగ్ కు వెళ్లేవి 2021 సంక్రాంతి మీద ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పుడు అవన్నీ హమ్మయ్య అనుకుంటాయి.