ప్రభాస్-అనుష్క మళ్లీ కలుస్తున్నారట?

తామిద్దరం స్నేహితులం మాత్రమే అని ఇప్పటికే ఎన్నోసార్లు స్పష్టం చేశారు. ఈ పుకార్లకు చెక్ పెట్టేందుకు కలిసి నటించడం కూడా మానేశారు. కానీ ప్రభాస్-అనుష్కలపై మినిమం గ్యాప్స్ లో ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి.…

తామిద్దరం స్నేహితులం మాత్రమే అని ఇప్పటికే ఎన్నోసార్లు స్పష్టం చేశారు. ఈ పుకార్లకు చెక్ పెట్టేందుకు కలిసి నటించడం కూడా మానేశారు. కానీ ప్రభాస్-అనుష్కలపై మినిమం గ్యాప్స్ లో ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ జంటపై మరో పుకారు చెలరేగింది.

ప్రభాస్-అనుష్క మరోసారి కలుస్తున్నారట. అయితే అది వ్యక్తిగతంగా కాదు, సినిమాల పరంగా. అవును.. ప్రభాస్ కొత్త సినిమాలో అనుష్కను హీరోయిన్ గా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అది మారుతి సినిమా.

మారుతి దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్ టైనర్ చేసేందుకు ఒప్పుకున్నాడు ప్రభాస్. తక్కువ వ్యవథిలో ఈ సినిమాను పూర్తిచేయాలనేది టార్గెట్. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారంటూ ఇప్పటికే చాలా పేర్లు తెరపైకొచ్చాయి. ఇప్పుడు అనుష్క పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

అనుష్క సినిమాలు తగ్గించేసింది. తగ్గించింది అనేకంటే ఆపేసింది అనడం కరెక్ట్ ఏమో. యూవీ క్రియేషన్స్ కు ఆమె ఓ సినిమా బకాయి ఉంది. ఆ మూవీని కూడా ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు. అంతలోనే ఇలా ప్రభాస్ సరసన అనుష్క అంటూ పుకార్లు ఊపందుకున్నాయి.

నిజంగా తన సినిమాలోకి అనుష్కను తీసుకోవాలనుకుంటే దర్శకుడు మారుతికి అది పెద్ద కష్టమేం కాదు, యూవీ జనాలతో ఓ మాట చెప్పిస్తే పనైపోతుంది. ఎందుకంటే, టాలీవుడ్ కు సంబంధించి ఆమె యూవీ నిర్మాతలతో తప్ప వేరే ఎవ్వరితో టచ్ లో ఉండడం లేదు. కాకపోతే అనుష్కకు మూడ్ ఉందా లేదా అనేది ఇక్కడ ఇష్యూ.