మూర్ఖుడ్ని పట్టుకొని మూర్ఖుడు అంటే ఎవ్వడూ ఒప్పుకోడు. కానీ లోకేష్ అలా కాదు, తనకు తాను 'నేను మూర్ఖుడ్ని' అంటున్నాడు. కాబట్టి మనం కూడా ఒప్పుకోవాల్సిందే. అవును.. నిజంగానే లోకేష్ మూర్ఖుడు. ఇది కామెంట్ కాదు, తనపై తాను ఇచ్చుకున్న స్టేట్ మెంట్.
నిన్న జరిగిన సభలో మాట్లాడిన లోకేష్.. తన తాత ఎన్టీఆర్ ను దేవుడిగా, తన తండ్రి చంద్రబాబును రాముడిగా, తనను తాను మూర్ఖుడిగా చెప్పుకొచ్చాడు. రెండేళ్ల తర్వాత అధికారంలోకి వస్తామని, అప్పుడు వైసీపీ నాయకులు అమెరికాలో ఉన్నా, ఐవరీ కోస్టులో ఉన్నా వదిలిపెట్టనని డైలాగ్ కొట్టారు లోకేష్. మూర్ఖత్వం అంటే ఇదే. నిజంగానే లోకేష్ మూర్ఖుడు.
ఏ నాయకుడైనా కార్యకర్తలకు అండగా ఉంటాడు, పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిస్తాడు. కానీ లోకేష్ అలా కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నేరాలు చేయమంటున్నాడు. పోలీసు కేసులు పడేలా వ్యవహరించమంటున్నాడు, చట్టాల్ని ఉల్లంఘించమంటున్నాడు. ఈ క్రమంలో తన పార్టీ కార్యకర్తలకు టార్గెట్ కూడా పెట్టాడు. లోకేష్ పై 11 కేసులున్నాయట. కాబట్టి రెండేళ్ల తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా తనను కలవాలంటే వాళ్లపై కనీసం 11-12 కేసులుండాలని, అంతకంటే తక్కువ ఉంటే తను కలవనని శెలవిచ్చారు లోకేష్. మూర్ఖత్వం అంటే ఇదే. నిజంగానే లోకేష్ మూర్ఖుడు.
తన తల్లి 'భువనేశ్వరి ఎపిసోడ్'ను లోకేష్ మరింత రెచ్చగొట్టాలని చూస్తున్నారు. తల్లిపై వివాదాలు వచ్చినప్పుడు, అనుచిత వ్యాఖ్యలు ఎవరైనా చేసినప్పుడు ఆ వివాదాల్ని వీలైనంత తొందరగా మరిచిపోవడానికి ఏ కొడుకైనా ప్రయత్నిస్తాడు. మరీ ముఖ్యంగా బహిరంగ సభల్లో సిగ్గులేకుండా 'భువనేశ్వరి ఎపిసోడ్'ను మరోసారి ప్రస్తావించరు. కానీ లోకేష్ మాత్రం తన తల్లి ఎపిసోడ్ ను మరింత రగల్చాలని చూస్తున్నారు. మైక్ దొరికిన ప్రతిసారి అవే మాటలు సిగ్గులేకుండా. మూర్ఖత్వం అంటే ఇదే. నిజంగానే లోకేష్ మూర్ఖుడు.
తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పుకుంటాడు ఏ రాజకీయ నాయకుడైనా. లేదంటే తమ ఎజెండాను వివరిస్తాడు. కానీ లోకేష్ మాత్రం అలాంటివేం చెప్పరు. ప్రజాసమస్యల గురించి, సంక్షేమం గురించి ఆయన మాట్లాడరు. అధికారులు, వైసీపీ నాయకల పేర్లను గుర్తుపెట్టుకుంటాం అంటారు. వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం అంటారు, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు సినిమా చూపిస్తాం అంటారు, ఇలా ప్రతీకార రాజకీయాలు చేస్తామని పబ్లిక్ గా చెబుతున్నారు. మూర్ఖత్వం అంటే ఇదే. నిజంగానే లోకేష్ మూర్ఖుడు.
టీడీపీ అన్-స్టాపబుల్, రికార్డులు తిరగరాయాలంటే టీడీపీతోనే సాధ్యం లాంటి సినిమా డైలాగులు కొట్టిన లోకేష్.. సీఎంపై కామెంట్స్ చేయడానికి తనకున్న అర్హత ఏంటనే ఆలోచన కూడా లేకుండా రెచ్చిపోయారు. మూర్ఖత్వం అంటే ఇదే. నిజంగానే లోకేష్ మూర్ఖుడు.