బంగార్రాజుపై దిల్ రాజు కన్ను

నైజాంలో ధైర్యం చేసి ఫార్వార్డ్ ట్రేడింగ్ చేయగలిగిన రిస్క్ చేసే బయ్యర్లు లేరు. వరంగల్ శ్రీను ఒకటి రెండు సినిమాలు హడావుడి చేసారు. వదిలేసారు.  Advertisement సత్తా వున్నా కూడా ఆసియన్ సునీల్, దగ్గుబాటి…

నైజాంలో ధైర్యం చేసి ఫార్వార్డ్ ట్రేడింగ్ చేయగలిగిన రిస్క్ చేసే బయ్యర్లు లేరు. వరంగల్ శ్రీను ఒకటి రెండు సినిమాలు హడావుడి చేసారు. వదిలేసారు. 

సత్తా వున్నా కూడా ఆసియన్ సునీల్, దగ్గుబాటి సురేష్ బాబు జీరో రిస్క్ వ్యాపారం తప్ప మరోటి చేయరు. దాంతో దిల్ రాజునే కింగ్ అవుతున్నారు. సంక్రాంతి సినిమాలు ఆర్ఆర్ఆర్. రాధేశ్యామ్, భీమ్లా నాయక్, ఇలా అన్నీ ఆయన చేతిలోనే. కానీ అవన్నీ వాయిదా పడిపోయాయి.

అందుకే ఇప్పుడు బంగార్రాజు మీద కన్ను పడినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా ఆసియన్ సునీల్-దిల్ రాజునే నైజాం ఏరియా చేయాల్సి వుంది. కానీ ఇప్పుడు మాంచి టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చి, ఆ సినిమాను కొట్టేయాలని దిల్ రాజు చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది తెలిసి సురేష్ బాబు-సునీల్ కాస్త ఇబ్బందిగా ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. ఇలా తమ సినిమాల విషయంలో కూడా పోటీకి దిగితే ఇక నైజాంలో డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం చేయడం అనవసరం. అందరూ అన్నీ వదిలేసి, మొత్తం దిల్ రాజుకే ఇచ్చేస్తే సరి అని వారు తమ సన్నిహితులతో కామెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.